Lok Sabha Election 2024: ఎన్నికల సమాచారం సమస్తం... వేలి కొసలపైనే! | Voter Registration Process In Election Commission Of India From 2015 To 2024, Details Inside | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: ఎన్నికల సమాచారం సమస్తం... వేలి కొసలపైనే!

Published Sat, May 11 2024 4:32 AM

voter registration process in election commission of india up to 2024

ఈసీ డిజిటల్‌ విప్లవం 

అన్ని సేవలూ ఆన్‌లైన్‌లోనే  

ఓటర్‌ నమోదు నుంచి  ఫిర్యాదు దాకా 

అందుబాటులో డిజిటల్‌ ఓటర్‌ ఐడీ 

ఓటరుగా నమోదు చేసుకోవాలంటే ఒకప్పుడు పెద్ద తతంగమే ఉండేది. సమీపంలోని రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత దాని పరిస్థితేమిటో తెలిసేది కాదు. ఓటర్ల జాబితా విడుదలైనప్పుడు అందులో పేరుంటే ఓటు హక్కు వచ్చినట్టు తెలిసేది! ఇదంతా గతం. ఇప్పుడు ఎన్నికల సంఘం టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగిస్తోంది. సేవలు, విధులను దాదాపుగా డిజిటలీకరించింది. తద్వారా పాదర్శకతను పెంచే దిశగా కృషి చేస్తోంది.

 ఓటరుగా నమోదు మొదలుకుని తప్పొప్పులు, చిరునామా సవరణలు, ఓటు బదిలీ దాకా ఇప్పుడన్నీ కూర్చున్న చోటినుంచి ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. అంతేనా?! ఓటు ఏ పోలింగ్‌ కేంద్రంలో ఉంది, అక్కడికెలా వెళ్లాలి, అభ్యర్థులు, వారి ఆస్తులు, కేసుల వివరాల వంటివన్నీ స్మార్ట్‌ ఫోన్‌ నుంచే తెలుసుకోవచ్చు. ఎన్నికల్లో అవకతవకలపై ఫిర్యాదులు కూడా ఆన్‌లైన్‌లోనే చేసేయవచ్చు. ఇలా గడిచిన దశాబ్ద కాలంలో ఎన్నికల సంఘం తీసుకొచి్చన డిజిటల్‌ మార్పులు అన్నీ ఇన్నీ కావు. వాటిని ఓసారి తెలుసుకుందాం...

ఎల్రక్టానిక్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ (2016)
ఎన్నికల విధుల్లో ఉండే సరీ్వస్‌ ఓటర్లకు పోస్టల్‌ బ్యాలెట్లను ఎల్రక్టానిక్‌ రూపంలో పంపించేందుకు ఎన్నికల సంఘం దీన్ని ప్రవేశపెట్టింది. ఎల్రక్టానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సిస్టమ్‌గా పిలుస్తారు.

ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ (2019)
తమ నియోజకవర్గంలో పోలింగ్‌ ఎప్పుడో ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు. ఓటరు జాబితాలో తమ పేరునూ పరిశీంచుకోవచ్చు. అభ్యర్థుల సమాచారం కూడా తెలుసుకోవచ్చు. పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ ఎంత ఉందన్నది ఎప్పడికప్పుడు తెలుసుకోవచ్చు. ఎన్నికల ఫలితాలు కూడా అందుబాటులో ఉంటాయి.

ఎరోనెట్‌ (2018) 
ఎలక్టోరల్‌ రోల్‌ ఆఫీసర్స్‌ నెట్‌వర్క్‌ సంక్షిప్త రూపమే ఎరోనెట్‌. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉమ్మడి సదుపాయాలు వినియోగించుకునేందుకు వీలుగా డిజిటల్‌ నెట్‌వర్క్‌ను ఈసీ రూపొందించింది. ఎన్‌వీఎస్‌పీ లేదా ఓటర్‌ హెల్ప్‌లైన్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా పౌరులు నమోదు చేసే డేటాకు ఇది బ్యాకప్‌గా పని చేస్తుంటుంది.

సి–విజిల్‌ యాప్‌ (2018)
ఎన్నికల నియమావళిని అభ్యర్థులు ఉల్లంఘించినా, అభ్యర్థులు పరిమితికి మించి ఖర్చు చేస్తున్నా; ఓటర్లను ధన, వస్తు రూపంలో ప్రలోభాలకు గురి చేస్తున్నా ఎవరైనా సరే ఈ యాప్‌ ద్వారా నేరుగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఫొటో, వీడియో రుజువులను లొకేషన్‌ జియోట్యాగ్‌ చేసి అప్‌లోడ్‌ చేయవచ్చు.

సక్షమ్‌ ఈసీఐ యాప్‌ (2023)
గతంలో దీన్ని పర్సన్స్‌ విత్‌ డిజెబుల్డ్‌ యాప్‌ (పీడబ్ల్యూడీ)గా పిలిచేవారు. దివ్యాంగులు ఇందులో అభ్యర్థుల సమాచారం, పోలింగ్‌ కేంద్రాలకు ఎలా వెళ్లాలి? ఫిర్యాదుల నమోదు, బూత్‌ వరకు వెళ్లేందుకు సాయం కోరడం తదితర సేవలను పొందవచ్చు.  

అబ్జర్వర్‌ యాప్‌ (2019)
ఎన్నికల పరిశీలకులు (సాధారణ, పోలీసు, వ్యయ) ఈ యాప్‌ ద్వారా తమ నివేదికలను ఫైల్‌ చేయవచ్చు. సి–విజిల్‌ యాప్‌ ద్వారా వచి్చన ఫిర్యాదులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఎక్కడ ఉందన్నది ఈ యాప్‌ ద్వారా ఎన్నికల అధికారులు చూడవచ్చు. అవసరమైతే స్క్వాడ్‌ను పిలవడం తదితర టాస్క్‌లను నిర్వహించుకోవచ్చు.

గరుడ యాప్‌ (2020)
బూత్‌ స్థాయి అధికారుల కోసం తెచి్చన యాప్‌. పోలింగ్‌ కేంద్రాల మ్యాపింగ్, క్షేత్రస్థాయి తనిఖీలు, డాక్యుమెంట్లు, ఫొటోల అప్‌లోడింగ్‌కు వీలు కల్పిస్తుంది.

నో యువర్‌ క్యాండిడేట్‌ (2022)
అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలు ఈ యాప్‌ ద్వారా ఓటర్లు తెలుసుకోవచ్చు. అభ్యర్థులు అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తులు, వారిపై క్రిమినల్‌ కేసులు తదితర పూర్తి సమాచారం లభిస్తుంది.

ఓటర్‌ టర్నౌట్‌ యాప్‌ (2019)
పోలింగ్‌ నాడు దేశవ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం ఎలా ఉందో ఈ యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంది.

క్యాండిడేట్‌ నామినేషన్‌ యాప్‌ (2020)
అభ్యర్థులు తమ నామినేషన్లను ఈ యాప్‌ ద్వారా డిజిటల్‌గానే దాఖలు చేయవచ్చు. అఫిడవిట్‌ డిజిటల్‌ కాపీని అప్‌లోడ్‌ చేసి, సెక్యూరిటీ డిపాజిట్‌ కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చు.

ఈ–ఎపిక్‌/డిజిటల్‌ ఓటర్‌ ఐడీ కార్డులు (2021)  
ఎలక్షన్‌ ఫొటో ఐడీ కార్డ్‌ (ఎపిక్‌) ఎంతో ముఖ్యమైనది. భౌతిక కార్డు లేని వారు ఈ–ఎపిక్‌ను ఈసీ పోర్టల్‌ నుంచి మొబైల్‌ ఫోన్లోకి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీన్ని ప్రింట్‌ చూపించి కూడా ఓటు వేయవచ్చు.

నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ (ఎన్‌వీఎస్‌పీ) (2015) 
ఈ పోర్టల్‌ (వెబ్‌సైట్‌) ద్వారా కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, నియోజకవర్గాలు, వాటి పరిధిలో పోలింగ్‌ కేంద్రాల సమచారం తెలుసుకోవచ్చు. బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌ (బీఎల్‌వో), ఎలక్టోరల్‌ రిజి్రస్టేషన్‌ ఆఫీసర్ల వివరాలు కూడా ఇక్కడే లభిస్తాయి. 

ఎన్‌వీఎస్‌పీ ఆధునీకరణ (2019) 
ఓటర్లకు కావాల్సిన సేవలన్నింటికీ ఏకీకృత పోర్టల్‌గా www.nvsp.in పేరుతో ఈసీ దీన్ని అభివృద్ధి చేసింది. తర్వాత ఠి్టౌ్ఛటట.్ఛఛిజీ.జౌఠి.జీnకు అనుసంధానం చేసింది. 

ఐటీ నెట్‌వర్క్‌ (2019) 
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల స్థాయిలో తాజా సమాచారం, ఓట్ల లెక్కింపు తాలూకు తాజా ఫలితాలు తెలుసుకునేందుకు ఎన్నికల సిబ్బంది కోసం తీసుకొచి్చన నెట్‌వర్క్‌. 2019 ఎన్నికల కౌంటింగ్‌కు ముందు దీన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు, రిటరి్నంగ్‌ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు ఈ ఐటీ సదుపాయం ద్వారా తాజా సమాచారం తెలుసుకుని డిజిటల్‌ తెరలపై ప్రదర్శించడానికి అవకాశం ఏర్పడింది. 

ఆధార్‌తో అనుసంధానం (2022) 
ఓటర్‌ జాబితాలో కచ్చితత్వానికి వీలుగా ఓటర్ల ఎపిక్‌లతో ఆధార్‌ అనుసంధాన కార్యక్రమాన్ని ఈసీ చేపట్టింది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 
 

Advertisement
 
Advertisement
 
Advertisement