ఓర్నీ! ఏకంగా కదులుతున్న ట్రైయిన్‌ నుంచి ఆయిల్‌ చోరీనా! | Viral Video: Thieves Steal Oil From Moving Train Goes Viral | Sakshi
Sakshi News home page

Viral Video: ఏకంగా కదులుతున్న ట్రైయిన్‌ నుంచి ఆయిల్‌ కొట్టేందుక యత్నం!

Dec 4 2022 8:59 PM | Updated on Dec 4 2022 8:59 PM

Viral Video: Thieves Steal Oil From Moving Train Goes Viral  - Sakshi

ఇంతవరకు దొంగలు, రోడ్లు, బ్రిడ్జ్‌లు, టవర్‌లు ఎత్తుకుపోవడం చూశాం. ఇప్పుడూ ఏకంగా కదులుతున్న ట్రైయిన్‌ నుంచి ఆయిల్‌ని ఎత్తుకుపోతున్నారు. దొంగతనానికి హద్దే లేదంటే ఇదేనేమో. ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే...రోడ్లు, బ్రిడ్జ్‌లు ఎత్తుకుపోవడం అయిపోయాక దొంగలు ఇప్పుడూ ఆయిల్‌ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు కాబోలు. ఈ మేరకు గూడ్స్ రైలు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌) ఆయిల్ డిపోకు వెళుతుండగా...అది గమ్యస్థానానికి చేరుకునేలోపు దొంగలు చమురును దొంగిలించడానికి దాని వెంటబడ్డారు. రైల్వేబ్రిడ్జి వద్ద బకెట్‌లతో నుంచుని ఆయిల్‌ దొంగలించేందకు యత్నించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 

(చదవండి: ఒక వ్యక్తినే పెళ్లాడిన ట్విన్‌ సిస్టర్స్‌: వీడియో వైరల్‌)

Advertisement
 
Advertisement
Advertisement