వైరల్‌: చెట్టుపై గొడ్డలి వేటు పడకుండా అడ్డుకున్న శునకం

Viral Video: Person Trying To Cutting Tree But Dog Saves - Sakshi

ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతుంటే మనుషులు మరింత బుద్దిహీనంగా ప్రవర్తిస్తున్నారు. ఈ భూమ్మీద కేవలం తాము మాత్రమే సంతోషంగా జీవించాలనే అంతగా స్వార్ధంగా ఆలోచిస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్నారు. సొంత ప్రయోజనం కోసం చెట్లు, మొక్కలను విచక్షణారహితంగా కొట్టేస్తున్నారు. తాజాగా అలాంటి పొరపాటే ఓ వ్యక్తి చేయబోయాడు.  కానీ ఆ మనిషి చేస్తున్న తప్పును ఓ నోరులేని జంతువు అడ్డుకుంది.

ఓ వ్యక్తి చెట్టును నరికేందుకు గొడ్డలి తీసుకురాగా.. ఓ కుక్క వద్దంటూ అతడికి అడ్డు పడింది. చెట్టును కొట్టేసేందుకు ఎంత ప్రయత్నించినా ఆ శునకం ఆపే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంది. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీశాడు. అయితే ఇది ఎక్క‌డ జ‌రిగిందో తెలీదో కానీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను నెటిజన్లు తెగ లైక్‌ చేస్తున్నారు. పర్యావరణం పట్ల శునకం చూపిస్తున్న శ్రద్దకు అందరూ శభాష్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కుక్క చూపించే విశ్వాసం కూడా మనిషి చూపించలేకపోతున్నాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: Viral Video: శునకం చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top