పెళ్లి దుస్తుల్లో పోలింగ్‌ కేంద్రానికి.. పెళ్లి కొడుకు ఏమన్నాడంటే..

Viral Video: Groom Casts Vote Ahead of His Wedding in Muzaffarnagar - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌ గురువారం జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 11 జిల్లాలోని 58 నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో శామ్లీ, మీరట్‌, హాపూర్‌, ముజఫర్‌ నగర్‌, ఘజియాబాద్‌, అలీగడ్‌, ఆగ్రా, బాఘ్‌పత్, గౌతమ్‌ బుద్ధానగర్‌, మథుర, బులంద్ షహర్  జిల్లాలలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పెళ్లి దుస్తుల్లో ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. యూపీలోని ముజ్‌ఫర్ నగర్‌లోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఈ సంఘటన జరిగింది.

అంకుర్‌ బాల్యన్‌ అనే వ్యక్తి పెళ్లి నేడు. కొద్ది గంటల్లో తన పెళ్లి ఉన్నప్పటికీ.. ఓటు వేయడం బాధ్యతగా భావించి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు..ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందు ఓటు వేయడం ముఖ్యమని తెలిపారు. ఓటు తరువాతే పెళ్లి, భార్య, ఇంకే పనైనా అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పెళ్లి రోజు పోలింగ్ బూతుకు వచ్చి విధిగా ఓటు హక్కు వినియోగించుకున్న అంకుర్ బల్యాన్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
చదవండి: వైరల్‌ వీడియో: రెస్టారెంట్‌లో ఉడుము ప్రత్యక్షం.. బోరున ఏడ్చిన మహిళ.. చివరికి!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top