
లక్నో: బాహుబలి సినిమాలో నదీ ప్రవాహంలో మునిగిపోకుండా ఒంటిచేత్తో పసిబిడ్డను పైకెత్తి పట్టుకున్న శివగామి పాత్ర గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాగే నదీ ప్రవాహంలో నిజమైన నయా బాహుబలి ఫొటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. దాదాపు భుజం ఎత్తులో ప్రయాగ్‌రాజ్ నగరాన్ని గంగానదీ ప్రవాహం ముంచెత్తడంతో తమ బిడ్డను ఒక జంట ఇలా పైకెత్తి పట్టుకుని భద్రంగా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది. ఆదివారం ప్రయాగ్‌రాజ్ నగర వీధిలో తీసిందీ ఫొటో. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రయాగరాజ్‌లో గంగా నది నీళ్ల తన ఇంటి వద్దకు చేరడంతో యూపీకి చెందిన పోలీసు అధికారి ఒకరు.. వరద నీటికి పూజ చేశారు. అనంతరం, తన ఇంటి రెండో అంతస్తు నుంచి వరద నీటిలో దూకి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
The Ganga river has entered the residential areas or residential areas have encroached the Ganga river area? pic.twitter.com/PAiel3Fcqw
— Piyush Rai (@Benarasiyaa) August 2, 2025
Sub-inspector saab has upper his game
- Dive from first floor.
- Two camera set-up
- Audience https://t.co/kksn2GCchs pic.twitter.com/4HT0EpJl3G— Piyush Rai (@Benarasiyaa) August 3, 2025