పెళ్లితంతులో పలు విచిత్రమైన ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు చూశాం. వధువు లేదా వరుడు విలక్షణంగా ఉండాలని చేసిన చిత్ర విచిత్రమైన పనులు చూశాం. కానీ ఇలాంటి వింతను ఏ పెళ్లితంతులో చూసి ఉండరు. వామ్మో వరుడికి మరీ ఇంతటి ఆత్మనిర్భరత అని విస్తుపోతారు. ఆఖరికి పెళ్లి విషయంలో ఇంతలానా అంటూ విస్తుపోయారు బంధువులు. పూజరి ఉన్నా సరే కాదని మరీ పెళ్లితంతు జరిపించాడు. ఎలాగో తెలుసా..!
ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో చోటు చేసుకుంది. సహరాన్‌పూర్‌లోని రాంపూర్‌కు చెందిన వివేక్ కుమార్ అనే వ్యక్తి తన పెళ్లికి తానే పండితుడయ్యాడు. వధువు పక్కన కూర్చొని వరడే(Groom) తన వివాహా మంత్రాలు అతడే జపిస్తూ పెళ్లితంతుని విజయవంతంగా పూర్తి చేశాడు. ఇది చూసి అక్కడున్న వాళ్లందరికీ నోట మాటరాలేదు.
మంత్రాలు చక్కగా వల్లిస్తూ(Chants Mantras) ప్రతి తంతుని అందరినీ ఆశ్చర్యపరిచేలా పూర్తి చేశాడు. ఈ వివాహ తంతుని చూస్తే ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi) చెప్పిన ఆత్మనిర్భర్ భారత్ గుర్తుకొస్తుంది. దీని అర్థం స్వావలంబన భారతదేశం. దీన్ని ప్రధాని మోదీ 2020లో ప్రారంభించారు. భారతీయులు స్వతంత్రంగా స్వావలంబనగా ఉండటానికి ప్రోత్సహించే కార్యక్రమం ఇది.
ఆయన ఉద్దేశ్యం ప్రకారం ఆత్మనిర్భర్ భారత్‌కి 'ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ, వైబ్రెంట్ డెమోగ్రఫీ అనేవి ఐదు మూల సంభాలని ఆ దిశగా మనమంతా ఏ దేశంపై ఆధాపడకుండా ఎదగాలనేది ఆయన ఆంతర్యం. అందుకే మోదీ ఆత్మనిర్భర్ భారత్ అని నినదించారు. అందుకు అర్థం వచ్చేలా ఈ వరడు తన పెళ్లికి తానే పండితుడిగా మారి వివాహం చేసుకున్నాడు. మోదీ భారత్ తొందరలో ఆత్మ నిర్భర్‌గా మారుతుందని తరుచుగా అనేవారు.
ఔను..! అనేలా ఈ వరుడు ఇలా చేతల్లో చూపించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం ఈ వ్యక్తి అని ఒకరు, తన పెళ్లిని అద్భుతంగా ఉండాలని ఇలా చేశాడంటూ మరొకరు కామెంట్‌లు చేస్తూ పోస్టులు పెట్టారు.
Groom Becomes Priest: #Saharanpur Man Conducts His Own Wedding Rituals pic.twitter.com/keHAABXD77
— Genzdigest (@Genzofficia_l) January 25, 2025
(చదవండి: అద్భుతమైన వెయిట్ లాస్ జర్నీ..! ఏకంగా 150నుంచి 68 కిలోలు..)
 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
