భారీ వర్షాల కారణంగా కాలనీలోకి వచ్చేసిన మొసలి: వీడియో వైరల్‌

Viral Video: Crocodile Entered Residential Colony In Madhya Pradesh - Sakshi

భారీ వర్షాలకు ఓ కాలనీలోకి ఏకంగా మొసలి వచ్చేసింది. ఇంతవరకు వర్షాలకు పాములు, చేపలు వంటివి కొట్టుకురావడం గురించి విన్నాం కానీ ఏకంగా మొసలి కొట్టుకురావడం వినలేదు కదా. కానీ మధ్యప్రధేశ్‌లోని ఒక కాలనీ ఈ ఘటన చోటుచోసుకుంది. 

వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లో ఆదివారం తెల్లవారుజామున కురిసిని భారీ వర్షాలకు ఒక మొసలి కొట్టుకు వచ్చింది. ఈ మేరకు ఆ మొసలి శివపురి జిల్లాలోని ఓ నివాస కాలనీ సంచరించడం మొదలు పెట్టింది. దీంతో  ఆ కాలనీ వాసులు అధికారులకు సమాచారం అందించారు.  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మాధవ్‌ నేషన్‌ల్‌ పార్క్‌ నుంచి రెస్క్యూ టీంని రంగంలోకి దింపి గంటపాటు శ్రమించి ఆ మొసలిని బంధించారు.

సుమారు ఎనిమిది అడుగులు ఉన్న ఈ మొసలిని సాంఖ్యసాగర్‌ సరస్సులో విడిచిపెట్టామని అధికారులు తెలిపారు. ఈ మేరకు మొసలి ఆ రెసిడెన్షియల్‌ కాలనీలోని ఇరుకైన సందులో సంచరిస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: ఐదు వేల మందితో.. ప్రపంచంలో అతిపెద్ద ‘జాతీయ జెండా మానవహారం’)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top