ఐదు వేల మందితో.. ప్రపంచంలో అతిపెద్ద ‘జాతీయ జెండా మానవహారం’

చండీగఢ్: ఆజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ చేపట్టిన హర్ ఘర్ తిరంగ ప్రచారాన్ని బలోపేతం చేసేలా చండీగఢ్ వాసులు ఒక వినూతన కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో బాగంగా అతి పెద్ద జాతీయ జెండాలా మానవహారంగా నిలబడి రికార్డు సృష్టించారు. ఈ మేరకు చండీగఢ్ విశ్వవిద్యాలయంలోని సుమారు 16 ఎకరాల క్రికెట్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 5 వేల మందికి పైగా మానవహారంగా నిలబడి అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్‌ఐడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కేంద్ర మంత్రి మీనాకాశీ లేఖి, చండీగఢ్ యూనివర్సిటీ ఛాన్సలర్ సత్నామ్ సింగ్ సంధు, విశ్వవిద్యాలయ అధికారులు తదితరులు హజరయ్యేరు.
దాదాపు 5 వేల మందికి పైగా అతిపెద్ద మానవహారంలా ఏర్పడి జాతీయ జెండాను రెపరెపలాడించి సరికొత్త రికార్డును సృష్టించారు. ‘హర్ ఘర్ తిరంగ’ అనేది జాతీయ జెండాతో ఉన్న సంబంధాన్ని అధికారికంగా లేదా సంస్థాగతంగా ఉంచడం కంటే వ్యక్తిగతంగా దేశభక్తిని పెంపొందించేలా మార్చడమే ఈ కార్యక్రమం లక్ష్యం. భారతదేశ ప్రజలు, మన దేశ సంస్కృతి, సమర యోధులు సాధించిన విజయాలు వాటి వెనుక దాగి ఉన్న అద్భుతమైన చరిత్రను స్మరించుకుంటూ జరుపుకోవాలనే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం ఈ ఉత్సవాలను ప్రోత్సహించింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరు కూడా వీక్షించండి.
#WATCH | Guinness World Record for the largest human image of a waving national flag achieved by Chandigarh University and NID Foundation at Chandigarh today.
Union Minister Meenakashi Lekhi was also present here on the occasion. pic.twitter.com/6jRgnsi5um
— ANI (@ANI) August 13, 2022
(చదవండి:
మరిన్ని వార్తలు