
సాంకేతికతో తెలివిగా వినియోగిస్తే అద్భుతాలు సృష్టించొచ్చని ఎందరో నిరూపించారు. సన్మార్గంలో వినియోగించినవాడు..మంచి స్కిల్స్ అందిపుచ్చుకోవడం తోపాటు..ప్రపంచమే గుర్తించేలా పేరుతెచ్చుకుంటాడు. అందుకు ఉదాహరణ ఈ 17 ఏళ్ల జాన్వి జిందాల్. సాంకేతిక సాయంతో ఎలా రికార్డులు సృష్టించగలమో చూపి యువతకు స్ఫూర్తిగా నిలిచింది.
చండీగఢ్‌కు చెందిన ఈ ఫ్రీస్టైల్ స్కేటర్ జాన్వి జిందాల్ స్వీయ శిక్షణతో రికార్డులకెక్కి చరిత్ర సృష్టించింది. ఒకటో రెండో కాదు ఏకంగా ఐదు గిన్నిస్ రికార్డులకెక్కిన అతి పిన్నయస్కురాలిగా నిలిచింది. స్కేటింగ్‌తో బాగ్రా నృత్యం ప్రదర్శించిన అని పిన్న వయస్కురాలు కూడా జాన్వినే కావడం విశేషం.
ఈ విలక్షణమైన ఫీట్‌తో 2021లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు దక్కించుకుంది. అయితే ఈ స్కేటింగ్ శిక్షణ కోసం ఎలాంటి ప్రముఖ ట్రైనర్‌తో కోచింగ్ తీసుకోకుండా ఇంటర్నెట్ సాయంతో స్వీయంగా నేర్చుకుంది.
కేవలం యూట్యూబ్‌లు, హోమ్ సెటప్ సాయంతో తనకు తానుగా శిక్షణ తీసుకుని రికార్డులు కొల్లగొట్టింది. ఆమె స్కేటింగ్‌తో భాంగ్రా నృత్యం, యోగా వంటివి అవలీలగా చేస్తుంది. ఆమె సాధించిన గిన్నిస్ రికార్డులు ఏంటంటే..
ఇన్‌లైన్ స్కేట్‌లపై 30 సెకన్లలో 360-స్పిన్స్ - 27 స్పిన్‌లు
రెండు చక్రాలపై వేగవంతమైన స్లాలొమ్ (20 కోన్‌లు) - 8.85 సెకన్లు
30 సెకన్లలో అత్యధిక వన్-వీల్ 360-డిగ్రీ స్పిన్స్ - 42 స్పిన్‌లు
ఒక నిమిషంలో అత్యధిక వన్-వీల్ 360-డిగ్రీల స్పిన్స్- 72 స్పిన్‌లు
వరుసగా అత్యధిక వన్-వీల్ 360-డిగ్రీల స్పిన్స్ - 22 స్పిన్‌లు
ఆమె ప్రాక్టీస్ అంతా ఫుట్‌పాత్‌ల మీదే సాగింది. అలా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. క్రమశిక్షణతో నేర్చుకుంటే..ఏదైనా అవలీలగా నేర్చుకోవచ్చని తెలిపి నేటి యుతకు స్ఫూర్తిగా నిలిచింది. క్రికెటర్ యువరాజ్ సింగ్ తర్వాత చండీగఢ్ నుంచి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించి రెండొవ వ్యక్తిగా జాన్వి నిలిచింది. యువరాజ్ సింగ్ పేరు మీద రెండు రికార్డులు ఉన్నాయి.
ఆ క్రెడిట్ తల్లిదండ్రులదే..
జాన్వి శిక్షణ ఐదేళ్ల ప్రాయం నుంచి మొదలైంది. అయితే ఆమెకు సరైన శిక్షణ ఇచ్చే కోచ్‌ని కనుగొనలేకపోయామని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. అందువల్ల ఇంటర్నెట్ సాయంతో బ్యాలెన్స్ చేయడం వంటివి నేర్చుకుందని అన్నారు ఆమె తండ్రి మునీష్ జిందాల్. ఇక తానే కోచ్‌గా మారి తన కూతురికి కొన్ని మెళుకువలు సాధించడంలో సాయం చేసినట్లు తెలిపారు.
తొలి ప్రయత్నంలో స్కేటింగ్‌లో విఫలమవ్వడంతో..చాలా కఠినమైన ప్రాక్టీస్ తీసుకుని అనుకున్నది సాధించిందని చెప్పుకొచ్చారాయన. ముఖ్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో నిలిచేలా జాన్వి స్పిన్నింగ్ స్కేటింగ్ కోసం చాలా కష్టపడినట్లు తెలిపారు. ఇక జాన్వీ తనలా చాలామంది అమ్మాయిలు ఈ స్కేటింగ్ క్రీడలోకి వచ్చేలా ప్రేరేపించడమే తన లక్ష్యమని అంటోంది.
అంతేగాదు ఏదైనా నేర్చుకోవడం ఇష్టమైతే ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టకుంటే నేర్చుకుంటే.. ఏదో ఒకనాడు దాన్ని సాధించగలుగుతారు అంటోంది. అంతేగాదు స్కేటింగ్ పట్ల ఉన్న ఆసక్తి, అకుంఠిత దీక్షలే ఈ విధంగా రికార్డులు సాధించేలా చేశాయని చెబుతోంది జాన్వి. ఏదైనా నేర్చుకోవాలంటే సాంకేతికతను ఎంత తెలివిగా వినయోగించగలుగుతున్నాం అన్నదే ప్రధానం..అదే మీకు అన్నితానై నేర్పిస్తుందని అంటోంది జాన్వి.
Chandigarh: A 17-year-old self-taught freestyle skater, Janvi Jindal, becomes the youngest girl in India to hold the maximum number of Guinness World Records, a total of five.
Janvi Jindal says, "I am the youngest girl to have created the maximum number of Guinness World… pic.twitter.com/ZeNJjULyVb— IANS (@ians_india) July 22, 2025
(చదవండి: సైక్లింగ్ పర్యావరణ హితం.. ఆరోగ్యం కూడా..!)