Food Challenge Video: Food Challeng Of Kathi Roll, Full Details In Telugu - Sakshi
Sakshi News home page

Viral Food Challenge: రండి.. 20 నిమిషాల్లో తినండి 20 వేలు గెలవండి

Sep 30 2021 1:25 PM | Updated on Sep 30 2021 4:53 PM

Viral: Finish 10kg Kathi Roll 30 Eggs 20 Minutes Get Bumper Prize  - Sakshi

Viral Food Challenge: ఓ రోల్‌ని జస్ట్ 20 నిమిషాల్లో తిని 20 వేలు గెలుచుకోవచ్చంటూ అందరినీ ఆకర్షించాడు. సాధారణంగా ఇటువంటి ఫుడ్ ఛాలెంజ్‌లు విదేశాల్లో ఎక్కువగా ఉంటాయి. అందులో తక్కువ సమయంలో ఎక్కువ ఫుడ్ లాగిస్తే సరిపోతుంది. 

ఇటీవల సోషల్‌మీడియాలో ఛాలెంజ్‌ల ట్రెండ్‌ కొనసాగుతోంది. ఒక్కోసారి అనుకోకుండా అవి వైరల్‌గా మారి దూసుకుపోతుంటాయ్ కూడా. తాజాగా ఓ రోడ్‌ సైడ్‌ పుడ్‌ స్టాల్‌ యజమాని ఇలానే భోజన ప్రియులకు ఓ ఛాలెంజ్‌ విసిరాడు. అదేంటంటే.. ఓ రోల్‌ని జస్ట్ 20 నిమిషాల్లో తిని 20 వేలు గెలుచుకోవచ్చంటూ అందరినీ ఆకర్షించాడు. సాధారణంగా ఇటువంటి ఫుడ్ ఛాలెంజ్‌లు విదేశాల్లో ఎక్కువగా ఉంటాయి. అందులో తక్కువ సమయంలో ఎక్కువ ఫుడ్ లాగిస్తే సరిపోతుంది. 

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ మోడల్ టౌన్ థర్డ్‌లో ఓ పుడ్‌ స్టాల్‌ యజమాని తను తయారు చేసిన 10 కేజీల బాహుబలి కాథీ రోల్‌ను కేవలం 20 నిమిషాల్లో తింటే రూ.20,000 ఇస్తానని పుడ్‌ లవర్స్‌కి బంఫర్‌ ప్రకటించాడు. ఇక ఆ రోల్‌ మేకింగ్‌ వీడియోని సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ ఛాలెంజ్‌కి ఎవరైనా రావచ్చని తెలిపాడు. ఆ రోల్‌ని.. గోధుమపిండితో తయారుచేసి 30 గుడ్లను ఆమ్లెట్‌గా వేయడంతో పాటు అదనంగా అందులో నూడుల్స్, కబాబ్స్, సోయా ఛాప్‌తో నింపేశాడు.

చూస్తుంటే ఎవరికైనా నోరు ఊరాల్సిందే. దీనంతటనీ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి పుడ్‌ లవర్స్‌ని నోరూరిస్తోంది. ఛాలెంజ్ ఆసక్తిగా ఉన్నా, రోల్‌ టేస్టీగా ఉన్నా.. ఆ బాహుబలి రోల్‌ని 20 నిమిషాల్లో తినాలంటే ఎంతటి భోజనప్రియులకైనా కొంచెం కష్టమే మరీ. అది కూడా 10 కేజీలు బరువు గల ఆహారం అంటే.. మామూలు విషయం కాదండి. అందుకే ఏమో అంత ధైర్యంగా ఆ ఛాలెంజ్ విసురుతున్నాడు.

చదవండి: ‘పాల దంతాలు ఊడిపోయాయి సాయం చేయండి’.. ప్రధాని మోదీ, అస్సాం సీఎంకు అక్కాచెల్లెళ్ల లేఖ 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement