మతం మారితే  రిజర్వేషన్లు వద్దు: వీహెచ్‌పీ

VHP Opposed Reservation to SC ST converted to Other Religions - Sakshi

ధన్తోలి: మతం మార్చుకున్న ఎస్సీలు, ఎస్‌టీలకు రిజర్వేషన్‌ ప్రయోజనాలు అందరాదని విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) అభిప్రాయపడింది. మతం మారిన వారు కుల ఆధారిత రిజర్వేషన్‌తోపాటు మైనారిటీ హోదాల్లోనూ ప్రయోజనం పొందుతున్నారని వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి విజయ్‌ శంకర్‌ తివారీ అన్నారు. శుక్రవారం నాగ్‌పూర్‌(మహారాష్ట్ర) ధన్తోలిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

అయితే ఇలా రెండు ప్రయోజనాలు పొందటాన్ని తాము అడ్డుకుంటామని తివారీ చెప్పారు. ఈ ప్రయోజనాలను ఆశించే చాలా మంది మతం మారుతున్నారన్నారు. కేంద్రం కూడా ఈ దిశగా రిజర్వేషన్లు అందకుండా చూసే ప్రణాళిక రూపొందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మత మార్పిడుల కోసం పలు ప్రయత్నాలు ఊపందుకున్నాయని, అలాంటి కార్యకలాపాలను ఎదుర్కోవడానికి వీహెచ్‌పీ తరపున ఒక కార్యాచరణను రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి: మత విద్వేష ప్రసంగాలపై సుప్రీం సీరియస్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top