మంత్రి రేఖ ఆర్యకు కరోనా పాజిటివ్‌ | Uttarakhand Minister Rekha Arya Tested Positive | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌ మంత్రికి కరోనా పాజిటివ్‌..

Dec 12 2020 2:44 PM | Updated on Dec 12 2020 3:34 PM

Uttarakhand Minister Rekha Arya Tested Positive - Sakshi

డెహ్రడూన్‌‌: ఉత్తరాఖండ్‌ మంత్రి రేఖా ఆర్య కరోనా భారీన పడ్డారు. ఆమె ఉత్తరఖండ్‌ ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు.  కరోనా టెస్ట్‌లో పాజిటివ్‌ వచ్చినట్లు రేఖా ఆర్య ట్విటర్‌ ద్వారా తెలిపారు. అయితే ఎటువంటి లక్షణాలు లేవని, డాక్టర్ల సమక్షంలో ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. గత వారం రోజులుగా తనతో కలిసిన వారు ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మంత్రితో పాటు ఆమె భర్త, ముగ్గురు పిల్లలకి వైరస్‌ సోకింది.

Advertisement
 
Advertisement
Advertisement