చికెన్, మటన్ కాదు.. పెళ్లిలో పనీర్ పెట్టలేదని రచ్చ రచ్చ.. వీడియో వైరల్‌..

Uttar Pradesh Fight Erupts At Baghpat Wedding Fight Video - Sakshi

లక్నో: పెళ్లి భోజనంలో మాంసాహారం పెట్టలేదనో లేదా చికెన్, మటన్ సరిపోను వడ్డించలేదనో జరిగిన గొడవల గురించి విన్నాం. కానీ ఉత్తర్‌ప్రదేశ్ భాగ్‌పత్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో మాత్రం పన్నీర్ కోసం రచ్చ రచ్చ చేశారు. పెళ్లి కొడుకు కుటుంబం తమను పన్నీర్ వడ్డించలేదని బాహాబాహీకి దిగారు. దీంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. చొక్కాలు చిరిపోయేలా పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు.

ఈ ఘటనలో వెయిటర్‌పై విచక్షణా రహితంగా దాడి జరిగింది. దీంతో అతను రోడ్డుపై అచేతన స్థితిలోపడిపోయాడు. అయినా అతడ్ని ఎవరూ పట్టించుకోలేదు. పెళ్లి వేడుకలో జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌మారింది. పన్నీరు కోసం ఇంతలా కొట్టుకోవడం చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.
చదవండి: స్కూల్ విద్యార్థులు వెళ్తున్న ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఏడుగురు మృతి

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top