ఘోరం: యువకుడి జననాంగాలపై రాడ్డుతో..

Uttar Pradesh: Dalit Youth Held Captive By Four People And Tortured - Sakshi

ఉత్తరప్రదేశ్‌: తమ అమ్మాయితో సంబంధం కొనసాగిస్తున్నాడనే ఆగ్రహంతో ఓ దళిత యువకుడిపై ఆ అమ్మాయి కుటుంబసభ్యులు తీవ్రంగా దాడి చేశారు. నలుగురు కలిసి ఆ యువకుడిని చితకబాదారు. అంతటితో ఆగకుండా జననాంగాలపై తీవ్రంగా దాడి చేశారు. మలద్వారంలో రాడ్‌ దించి దారుణంగా వ్యవహరించారు. దీంతో ఆ యువకుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

ఉత్తరప్రదేశ్‌లోని లక్క్క్ష్మీపూర్‌ ఖేరీ ప్రాంతంలో 22 ఏళ్ల దళిత యువకుడిపై ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తండ్రి బ్రహ్మాదీన్‌, ఆమె సోదరులు భరత్‌, గజరాజ్‌, రాజు ఆ యువకుడిపై దాడి చేయాలని ప్లాన్‌ వేశారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆ దళిత యువకుడిని వెంబడించారు. అనంతరం వెంటనే చితక్కొట్టారు. తీవ్రంగా దాడి చేసి వదిలేయకుండా అమానుషంగా ప్రవర్తించారు. మలద్వారంలో పెద్ద ఇనుప రాడ్‌ చొప్పించారు. తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. 

ఈ సమాచారం తెలుసుకున్న బాధిత యువకుడి సోదరుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న టికోనియా పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆ యువకుడిపై దాడికి పాల్పడిన తండ్రి బ్రహ్మాదీన్‌, అతడి ముగ్గురు కుమారులు భరత్‌, గజరాత్‌, రాజులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. బాధిత యువకుడు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పైగా దళితుడిపై దాడి జరగడంతో రాజకీయంగా వివాదాస్పదమవుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top