
ప్రతీకాత్మక చిత్రం
US Passenger Dies Onboard Air India Flight Returns To Delhi : ఢిల్లీ నుంచి అమెరికా వెళ్తున్న విమానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి నేవార్క్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. విమానం టేకాఫ్ అయిన మూడు గంటలకు ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో విమానం ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది.
(చదవండి: లండన్ - హైదరాబాద్ ఫ్లైట్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో లీక్.. అత్యవసర ల్యాండింగ్..)
"ఎయిరిండియా ఢిల్లీ-నెవార్క్ (యూఎస్) విమానంలో వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా.. టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత విమానం ఢిల్లీకి తిరిగి వచ్చింది" అని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు వార్తా సంస్థ ఏఎన్‌ఐకి తెలిపారు. "డిసెంబర్ 4న, తన భార్యతో కలిసి నెవార్క్‌కు ప్రయాణిస్తున్న ఒక అమెరికి పౌరుడు మరణించిన కారణంగా ఢిల్లీ నుంచి నెవార్క్‌కి వెళ్లే ఫ్లైట్ నంబర్ ఏఐ-105 తిరిగి వచ్చింది" అని తెలిపారు.
(చదవండి: ‘దేశంలో రాజాలు ఎందరున్నా.. మహారాజా ఒక్కడే’)
విమానాశ్రయ వైద్యుల బృందం విమానం వద్దకు చేరుకుని.. ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అతను చనిపోయినట్లు నిర్ధారించారు. మరణించిన వ్యక్తి అమెరికన్ కాగా.. భార్యతో కలిసి అతడు ప్రయాణం చేస్తున్నాడు. విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని.. తిరిగి ఇదే విమానం.. శనివారం సాయంత్రం 4 గంటలకు కొత్త టీంతో అమెరికా ప్రయాణం అయ్యిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
చదవండి: సొంతింటికొస్తున్న విమానం