Union Minister Thawar Chand Gehlot Daughter Yogita Solanki Passed Away Due To Covid - Sakshi
Sakshi News home page

కరోనాతో కేంద్రమంత్రి కుమార్తె కన్నుమూత

May 4 2021 2:51 AM | Updated on May 4 2021 10:51 AM

Union Minister Thawarchand Gehlots Daughter Dies Of Covid-19 - Sakshi

ఇండోర్‌: కేంద్ర మంత్రి తావర్‌ చంద్‌ గహ్లోత్‌ కుమార్తె గోయిత సోలంకి (42) కరోనా బారినపడి కన్నుమూశారు. చికిత్స తీసుకుంటూ ఆమె మరణిం చారని ఆస్పత్రి అధికారులు సోమవారం వెల్లడించారు. కరోనా సోకిన అనంతరం ఆమెను మొదట గా ఉజ్జయినిలోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో వారం క్రితం ఇండోర్‌లోని మేదాంత ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆమె ఊపిరితిత్తుల్లో 80 శాతం వైరస్‌ బారినపడటంతో రక్షించలేకపోయామని ఆస్పత్రి డైరెక్టర్‌ సందీప్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. ఆమె మరణం పట్ల మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ, పలువురు పార్టీ నేతలు విచారం వ్యక్తం చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement