8న కర్నూలుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాక  | Sakshi
Sakshi News home page

8న కర్నూలుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాక 

Published Sun, Jan 1 2023 7:33 AM

Union Home Minister Amit shah arrival kurnool on 8th January - Sakshi

సాక్షి, కర్నూలు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈ నెల 8వ తేదీన కర్నూలుకు రానున్నట్లు బీజేపీ కర్నూలు జిల్లా అధ్య­క్షుడు పి.రామస్వామి ’సాక్షి’కి  తెలిపారు. ప్రవా­సి యోజన కార్యక్రమంలో భాగంగా హోం మంత్రి కర్నూలు జిల్లాతో పాటు  హిందూపురంలో పర్యటిస్తారని పేర్కొన్నారు.

పర్యటనలో భాగంగా కర్నూలు నగరంలోని బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్తారని తెలిపారు. అనంతరం నగరంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు. 

చదవండి: (ఐదు పైసలకే బిర్యానీ.. క్యూ కట్టిన జనం.. పోలీసుల లాఠీ చార్జ్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement