లక్షణాలు లేకుండానే కేంద్ర మంత్రికి కరోనా | Union Ayush Minister Shripad Naik tests Covid positive | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి యశోనాయక్‌ శ్రీపాదకు కరోనా

Aug 12 2020 7:51 PM | Updated on Aug 12 2020 8:14 PM

Union Ayush Minister Shripad Naik tests Covid positive - Sakshi

ఈ రోజు చేయించుకున్న కరోనా పరీక్షలో తనకు పాజిటివ్‌ వచ్చినట్లు ఆయనే స్వయంగా ఇవాళ(బుధవారం) వెల్లడించారు.

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులను సైతం ఈ మహమ్మారి వెంటాడుతోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంత్రి అమిత్‌ షాతో పాటు మరో నలుగురు మంత్రులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా వారి జాబితాలో కేంద్ర మంత్రి ‌యశోనాయక్‌ శ్రీపాద కూడా చేరారు. ఈ రోజు చేయించుకున్న కరోనా పరీక్షలో తనకు పాజిటివ్‌ వచ్చినట్లు ఆయనే స్వయంగా ఇవాళ(బుధవారం) వెల్లడించారు. (చదవండి: ప్రముఖులపై కరోనా పంజా)

‘ఈరోజు నేను కోవిడ్‌ పరీక్షలు చేయించుకున్నాను. నాలో ఎటువంటి కరోనా లక్షణాలు కనబడనప్పటికి పాజిటివ్‌ వచ్చింది. అయినా నా ఆరోగ్యం​ నిలకడగానే ఉంది. డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు. అయితే వైద్యులు పాజిటివ్‌గా నిర్థారించడంతో ఇటీవల కాలంలో తనను కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని మంత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు. (చదవండి: ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం)

Advertisement
 
Advertisement
Advertisement