ఢిల్లీ: ముగిసిన గవర్నర్ల సదస్సు | Two Days Governors Conference Ends | Sakshi
Sakshi News home page

ఢిల్లీ: ముగిసిన గవర్నర్ల సదస్సు

Aug 3 2024 8:45 PM | Updated on Aug 3 2024 8:48 PM

Two Days Governors Conference Ends

సాక్షి,ఢిల్లీ: రెండు రోజులపాటు జరిగిన గవర్నర్ల సదస్సు శనివారం(ఆగస్టు 3) ముగిసింది. సదస్సులో  రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు.  కీలక అంశాలపై రెండు రోజులపాటు సదస్సులో చర్చలు కొనసాగాయి. మహిళా సాధికారత, గిరిజనుల అభివృద్ధి సహా పలు అంశాలపై చర్చించారు. 

నూతన నేర న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, యూనివర్సిటీల అక్రిడేషన్, గిరిజన ప్రాంతాల అభివృద్ధి , వెనుకబడిన జిల్లాలు, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి లో గవర్నర్ల పాత్రపై రాష్ట్రపతి, ప్రధాని దిశానిర్దేశం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement