Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Top10 Telugu Latest News Evening Headlines 8th June 2022 - Sakshi

1. ఎమ్మెల్యేలు మొత్తం నిరంతరం ప్రజల్లోనే ఉండాలి

గడపగడపకూ కార్యక్రమాన్ని ఏరకంగా చేశాం? ఎలా చేస్తున్నాం? ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి? ఎలా సమర్థత పెంచుకోవాలి? అన్నదాన్నికూడా మనం నిరంతరంగా చర్చించుకోవాలని సీఎం జగన్‌ అన్నారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. రిటైర్మెంట్‌ ప్రకటించిన మిథాలీ రాజ్‌


భారత స్టార్‌ క్రికెటర్‌ కెప్టెన్‌ మిథాలీ రాజ్ రిటైర్మెంట్‌ ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె సోషల్‌ మీడియా వేదికగా బుధవారం ప్రకటన విడుదల చేశారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. అమ్నేషియా పబ్‌ కేసు: బెంజ్‌, ఇన్నోవా కార్లు ఎవరివి..?


టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జూబ్లీహిల్స్‌ లైంగిక దాడి కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలి. సీవీ ఆనంద్‌ కొన్ని విషయాలు బయటకు చెప్పకుండా దాచిపెట్టారు అని పేర్కొన్నారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. వైద్యుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారా?: సుప్రీంకోర్టు ఆగ్రహం


దేశవ్యాప్తంగా వైద్యుల కొరత ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది 1,456 మెడికల్ సీట్లు ఖాళీగా ఉండడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, కేంద్రం కలిసి వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. నిప్పుల కొలిమిలో వేసినా కాలిపోదు ఇది!


మార్గరెట్‌ అట్వుడ్‌ రాసిన 'ది హ్యాండ్‌మెయిడ్స్ టేల్' అనే క్లాసిక్‌ నవలని.. ప్రత్యేకమైన ఫైర్‌ఫ్రూఫ్‌ మెటీరియల్‌ని ఉపయోగించి ప్రింట్‌ చేశారు. ఈ బుక్‌కు చాలా ప్రత్యేకతలు.. ప్రింట్‌ చేయడం వెనుక ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలియాలంటే..
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. బెంగాల్‌లో హీటెక్కిన పాలిటిక్స్‌.. జేపీ నడ్డా టూర్‌పై టెన్షన్‌


బెంగాల్‌లో బీజేపీ వర్సెస్‌ అధికార పార్టీ తృణముల్‌ కాంగ్రెస్‌ అన్నట్టు వాడివేడి పాలిటిక్స్‌ చోటుచేసుకుంటున్నాయి. ప్రతీ రోజు ఏదో ఒక వివాదంలో ఈ రెండు పార్టీల నేతలు ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు. తాజాగా బెంగాల్‌లో మరోసారి రాజకీయం వేడిక్కింది. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. కలెక్షన్ల లాభం కన్నా విలువైందే దొరికింది


బాలీవుడ్​ చాక్లెట్​ బాయ్​ కార్తీక్ ఆర్యన్​ ఇటీవల నటించి సూపర్​ హిట్​ కొట్టిన చిత్రం 'భూల్​ భులయ్యా 2'. కియరా అద్వానీ, టబు నటించిన ఈ సీక్వెల్​ మూవీ బాలీవుడ్​ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్​ తర్వాత సక్సెస్​ రుచి చూపించింది. మే 20న విడుదలై ఈ సినిమా సుమారు రూ. 150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ సందర్భంగా హీరోకి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. అసభ్య ప్రవర్తన?..కాలర్‌ పట్టి ట్రాఫిక్‌ ఎస్సైను చితకబాదేశారు


మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ.. డ్యూటీలో ఉన్న ఓ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ను చితకబాదిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. దేశ రాజధానిలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. టెక్నాలజీని దుర్వినియోగం కానివ్వొద్దు: నిర్మలా సీతారామన్‌


టెక్నాలజీలు దుర్వినియోగం కాకుండా చూసేందుకు డిజిటైజేషన్‌ను అర్థం చేసుకోవడంలో మరింత ముందు ఉండాలని నియంత్రణ సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. ఈ దశాబ్దంలో డిజిటల్‌ విధానాల వినియోగం గణనీయంగా పెరగనుందని, డిజిటైజేషన్‌పరంగా తగు రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి
10. బీజేపీ సత్తా ఏమిటో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తేల్చుకోవాలి


ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ‍్యలకు కౌంటర్‌ ఇచ్చారు. మంత్రి రోజా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజీపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అవగాహన లేకుండా మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్‌తో కలిసి బీజేపీ.. ఏపీకి అన్యాయం చేసింది. బీజేపీ సత్తా ఏమిటో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తేల్చుకోవాలని సవాల్‌ విసిరారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top