అసభ్య ప్రవర్తన?.. ట్రాఫిక్‌ ఎస్సైను చితకబాదేశారు | Delhi Traffic Cop Attacked Over Misbehaviour Allegations Viral | Sakshi
Sakshi News home page

అసభ్య ప్రవర్తన?..కాలర్‌ పట్టి ట్రాఫిక్‌ ఎస్సైను చితకబాదేశారు

Jun 8 2022 2:38 PM | Updated on Jun 8 2022 2:59 PM

Delhi Traffic Cop Attacked Over Misbehaviour Allegations Viral - Sakshi

పట్టపగలు అంతా చూస్తుండగా.. డ్యూటీలో ఉన్న ఓ ట్రాఫిక్‌ ఎస్సైను చితకబాదేశారంతా. 

మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ.. డ్యూటీలో ఉన్న ఓ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ను చితకబాదిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. దేశ రాజధానిలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

దక్షిణ ఢిల్లీ సంగమ్‌ విహార్‌ ప్రాంతంలో.. ట్రాఫిక్‌ జామ్‌ను క్లియర్‌ చేస్తుండగా స్థానిక ట్రాఫిక్‌ ఎస్సైతో కొందరు వాగ్వాదానికి దిగారు. ఉన్నట్లుండి జనాలంతా కలిసి ఆ ఎస్సైను చితకబాదేశారు. ఘటనకు కారణం ఏంటన్నదానిపై అధికారిక స్పష్టత లేకుంది. కానీ, ఓ యువతి సదరు ట్రాఫిక్‌ ఎస్సై కాలర్‌ పట్టుకుని మరీ రెండు చెంపలను చెడామడా వాయించడం ఆధారంగా.. ఆ యువతితో ఎస్సై అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. 

సదరు యువతితో పాటు ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు సైతం అతనిపై దాడికి పాల్పడ్డారు. గాయపడిన ట్రాఫిక్‌ ఎస్సైను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి టిగ్రి పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది. ట్రాఫిక్‌ ఉల్లంఘించిన సదరు యువతి.. ఆ ట్రాఫిక్‌ ఎస్సై తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపిస్తోంది. 

ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది. యువతి, ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు, చుట్టూ చేరిన కొందరు ఆ ట్రాఫిక్‌ ఎస్సైను ఉతికి ఆరేశారు. అయితే పక్కనే వైట్‌ డ్రెస్‌లో ఉన్న ట్రాఫిక్‌ సిబ్బంది కొందరు ఆ ట్రాఫిక్‌ ఎస్సైను రక్షించే ప్రయత్నం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement