Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ Top10 Telugu Latest News Evening Headlines 20th June 2022 | Sakshi
Sakshi News home page

Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Mon, Jun 20 2022 5:00 PM

Top10 Telugu Latest News Evening Headlines 20th June 2022 - Sakshi

1.. YS Jagan: పట్టణాభివృద్ధిపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు
పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్షించారు. త్వరగా ఇళ్లను పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లలో రూ.4500 కోట్లు ఖర్చుచేశామని, ఇంకా కనీసంగా మరో రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అధికారులు వివరించారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2.. సాంకేతిక లోపం.. కేబుల్‌ కారులో చిక్కుకున్న 11 మంది టూరిస్టులు
హిమాచల్ ప్రదేశ్‌ పర్వానూలోని టింబర్‌ ట్రైల్‌ రిసార్టులో సోమవారం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పదకొండు మంది పర్యాటకులు కేబుల్ కారులో చిక్కుకుపోయారు. సాంకేంతిక లోపం ఏర్పడటంతో రోప్‌వే మధ్యలో గాల్లో ఆగిపోయింది. చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించేందుకు రెస్క్యూ ట్రాలీని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు తొమ్మిది మందిని సురక్షితంగా రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3.. మోదీ జీ.. మీ దోస్త్‌ను అడిగి తెలుసుకోండి అంటూ అసదుద్దీన్‌ ఒవైసీ కౌంటర్‌
ప్రధాని నరేంద్ర మోదీపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ, ఆయన దోస్త్‌ అబ్బాస్‌ గురించి ఒవైసీ ప్రస్తావించడం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మోదీ స్నేహితుడిని ప్రస్తావిస్తూ ఒవైసీ.. బీజేపీకి కౌంటర్‌ ఇచ్చారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4.. భారతీయుల దృష్టి మళ్లించేందుకే అగ్నిపథ్‌ తీసుకొచ్చారా..?: కేటీఆర్‌
కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. అగ్నిపథ్‌కు నిరసనగా సోమవారం రాజకీయ పార్టీలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5.. వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా?.. అయితే డేంజర్‌లో పడ్డట్టే!
మనం రోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో వివిధ వస్తువులను వినియోగిస్తుంటాం. వాటిని ఎంత కాలం ఉపయోగించాలనే విషయంపై చాలా మందికి అవగాహన లేదు. దీంతో ఎక్కువ కాలం వినియోగిస్తూనే ఉంటాం. కాలపరిమితి ముగిసిన వాటిని వాడితే ప్రమాదం పొంచి ఉంది. వీటితో పాటు వాడుకలో లేని వస్తువులను ఇంట్లోనే కుప్పలుగా వదిలేస్తుంటారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6.. ఎయిర్‌ ఇండియా చరిత్రలో అతిపెద్ద ఎయిర్‌క్రాప్ట్‌ డీల్‌
ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ దాదాపు 300 నారోబాడీ జెట్లను ఆర్డర్‌ చేసేందుకు సిద్ధమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇది విమానాయన చరిత్రలో అతి పెద్ద ఆర్డర్‌లలో ఒకటి అని స్పష్టం చేశాయి. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఎయిర్‌లైన్‌ కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో తన విమానాలను సరిదిద్దాలని చూస్తోంది. అధికారులు అంటున్నారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7.. ఒకే రోజు టెస్ట్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ముగ్గురు క్రికెట్‌ దిగ్గజాలు
భారత క్రికెట్‌ చరిత్రలో జూన్‌ 20వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ తేదీ భారత క్రికెట్‌కు ముగ్గురు దిగ్గజాలను అందించిన చిరస్మరణీయమైన రోజు. వివరాల్లోకి వెళితే.. భారత క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించిన ముగ్గురు క్రికెటర్లు ఇదే తారీఖున టెస్ట్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. 
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8..O2 Telugu Movie Review: పెళ్లి తర్వాత నయన తార మొదటి చిత్రం.. 'ఓ2' రివ్యూ.. ఎలా ఉందంటే ?
లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార తాజాగా 'ఓ2 (O2, ఆక్సిజన్‌)' సినిమాతో నేరుగా ఓటీటీలో సందడి చేస్తోంది. జీఎస్‌ విక్నేష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 17 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. నయన తార పెళ్లి తర్వాత విడుదలకావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలకు తగినట్లుగా ఓ2 (O2) ఉందా? లేదా? రివ్యూలో చూద్దాం.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9.. సంచలనం..అదిరిపోయే డిజైన్‌లతో ఓలా ఎలక్ట్రిక్‌ కారు.. ఎలా ఉందో మీరే చూడండి!
ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లతో ఆటోమొబైల్‌ రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ఓలా సంస్థ త్వరలో మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్‌ కార్లను విడుదల చేయనుంది. 10లక్షల ఎలక్ట్రిక్‌ హచ్‌ బ్యాక్‌ కార్లను తయారు చేసేందుకు సిద్ధమవ్వగా..ఆ కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్‌లో వైరల్‌ అవుతున్నాయి. 
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మహారాష్ట్రలో విషాదం.. ఒకే ఇంట్లో 9 మంది అనుమానాస్పద మృతి
మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ముంబైకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంగ్లీ జిల్లాలోని మహైసల్‌ గ్రామంలో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఇంట్లోనే విగత జీవులుగా కనిపించారు. 
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
 
Advertisement