టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు

Today Top News 7th January 2021 - Sakshi

‘బాబు మత రాజకీయాలు.. పతనం తప్పదు..’
దేవుడితో రాజకీయం చేస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి మరింత పతనం తప్పదని ఏఐసీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే ఆర్‌కే రోజా హెచ్చరించారు. గతంలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చారని, అలిపిరిలో దేవుడు ఎలా బుద్ధి చెప్పాడో తెలుసు. పూర్తి వివరాలు..

మధ్యతరగతి ప్రజలకు ఏపీ​ ప్రభుత్వం కొత్త పథకం
పట్టణ, నగరాల్లోని పేదలకు సొంత ఇంటి స్థలం, తద్వారా సొంతింటి కలను నిజం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలు..

మరో కార్యక్రమానికి వైఎస్‌ జగన్‌ సర్కార్‌ శ్రీకారం
తెలుగుదేశం హయాంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ శ్రీకారం చుట్టింది. టీడీపీ ప్రభుత్వంలో కూల్చిన ఆలయాల నిర్మాణంతో పాటు, 70 కోట్లతో ఇంద్రకీలాద్రిపై చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం భూమిపూజ చేయనున్నారు. పూర్తి వివరాలు..

రహదారుల అభివృద్దికి 6400 కోట్లు
రాష్ట్రంలో  రహదారుల అభివృద్దికి 6400 కోట్లు కేటాయించామని రోడ్లు,భవనాల శాఖా మంత్రి శంకర్ నారాయణ అన్నారు.  ఈ మేరకు  న్యూ డెవలప్ మెంట్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. పూర్తి వివరాలు..

చంద్రబాబుపై పోలీస్‌ అధికారుల సంఘం ఆగ్రహం
చంద్రబాబుపై ఏపీ పోలీస్‌ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. 'రాజకీయ స్వలాభాల కోసం పోలీసులకు మతాలను ఆపాదించవద్దు. కుల, మత అనే భేదం లేకుండా ప్రజల కోసం సేవచేస్తున్నాం. పూర్తి వివరాలు..

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి కేసీఆర్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో ఆయనకు ఆస్పత్రి వైద్యులు అందుకు సంబంధించిన ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు..

అఖిలప్రియ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. హఫీజ్‌పేట్‌ భూ వివాదంలో సూత్రధారి భూమా అఖిలప్రియగా పోలీసులు తేల్చారు.. ఈ కేసులో ఏ-1గా భూమా అఖిలప్రియను పేర్కొంటూ, ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు మార్పులు చేశారు. ఏ-2గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ-3గా భార్గవ్‌రామ్‌, నిందితులుగా శ్రీనివాసరావు, సాయి,చంటి, ప్రకాశ్‌ పేర్లను పోలీసులు నమోదు చేశారు. పూర్తి వివరాలు..

తెలంగాణ సీజేగా హిమాకోహ్లి ప్రమాణస్వీకారం
తెలంగాణ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమాకోహ్లి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌భవన్‌లో జస్టిస్‌ హిమాకోహ్లితో ప్రమాణ స్వీకారం చేయించారు. పూర్తి వివరాలు..

తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు? 
బీజేపీ సీనియర్ నేత, రెబల్ స్టార్ కృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌ పదవి కట్టబెట్టనుందని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు గవర్నర్ పదవిని ఆయనకు అప్పగించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. కొందరు అయితే ఏకంగా కృష్ణం రాజుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు..

కరోనా వ్యాక్సిన్‌.. అతి పెద్ద సవాల్‌
కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి, నిల్వ, పంపిణీ వీటన్నింటికి మించి మరో అతి పెద్ద సవాల్‌ కేంద్రం ఎదుర్కోబోతోంది. అదే టీకా తీసుకోవడంపై ప్రజల్లో నెలకొన్న సంశయం. రకరకాల కారణాలతో ఏకంగా 69 శాతం మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలా? వద్దా? అని తేల్చుకోలేకపోతున్నారని లోకల్‌సర్కిల్‌ సర్వే తేల్చి చెప్పింది. పూర్తి వివరాలు..

ట్రంప్‌కు మరో షాక్ : అరెస్ట్‌ వారెంట్‌
మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవికి  గుడ్‌బై చెప్పనున్నడొనాల్డ్ ట్రంప్‌కు మరో  షాక్‌ తగిలింది. ఇరాన్‌ సైనికాధికారిని హత్య చేసిన కేసులో ఇరాక్‌ కోర్టు అరెస్ట్‌ వారెం‍ట్‌ జారీ చేసింది. జనరల్ ఖాసిమ్ సులేమాని, అబూ మహదీ అల్ ముహండిస్‌లను హతమార్చిన డ్రోన్‌దాడిపై దర్యాప్తు చేయాల్సిందిగా బాగ్దాద్ కోర్టు జడ్జ్‌ గురువారం ఆదేశించారు. పూర్తి వివరాలు..

మార్కెట్లోకి మేడ్ ఇన్ ఇండియా లావా మొబైల్స్
మళ్లీ మొబైల్ మార్కెట్ లో మేడ్ ఇన్ ఇండియా కంపెనీల జోరు కొనసాగుతుంది. ప్రస్తుతం మొబైల్ మార్కెట్ లో విదేశీ కంపెనీలదే పై చేయి. ప్రధానంగా చెప్పాలంటే చైనా మొబైల్ కంపెనీలు ఈ మార్కెట్ లో దూసుకెళ్తున్నాయి. అయితే వీటిని తట్టుకొని నిలబడటానికి గతంలో మైక్రో మాక్స్ కొన్ని మొబైల్స్ విడుదల చేయగా.. పూర్తి వివరాలు...

చిన్న గ్రామం నుంచి ముఖ్యమంత్రిగా రిచా చద్దా..
బాలీవుడ్‌ నటి రిచా చద్దా రాబోయే చిత్రం ‘మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్’‌. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో రిచా  వెనుకబడిన వర్గాల ప్రజల కోసం పోరాడే పవర్‌ఫుల్‌ మహిళ నాయకురాలిగా కనిపించనున్నారు. పూర్తి వివరాలు..

ఆయన కల నెరవేరింది.. కానీ ఈరోజు బతికిలేరు
ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. 26 ఏళ్ల సిరాజ్‌ కంటతడి వీడియో సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు.. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top