చంద్రబాబుపై పోలీస్‌ అధికారుల సంఘం ఆగ్రహం | AP Police Officers Association Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

రాజకీయ మైలేజ్‌ కోసం నిరాధార ఆరోపణలు సిగ్గుచేటు

Jan 7 2021 4:41 PM | Updated on Jan 7 2021 6:38 PM

AP Police Officers Association Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ: చంద్రబాబుపై ఏపీ పోలీస్‌ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు గురువారం మీడియాతో మాట్లాడారు. 'రాజకీయ స్వలాభాల కోసం పోలీసులకు మతాలను ఆపాదించవద్దు. కుల, మత అనే భేదం లేకుండా ప్రజల కోసం సేవచేస్తున్నాం. రాజకీయ మైలేజ్‌ కోసం పోలీస్‌ వృత్తిపై నిరాధార ఆరోపణలు సిగ్గుచేటు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న పోలీసులపై మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీలో ఆ నాయకుడు ఏం నేర్చుకున్నాడు. ఇలాంటి వ్యాఖ్యల వలన పోలీసులు ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. పోలీస్‌శాఖలో ఎవరికి కుల, మత భేదాలు లేవు' అని ఏపీ పోలీస్‌ అధికారుల సంఘం పేర్కొంది. చదవండి: (మరో కార్యక్రమానికి వైఎస్‌ జగన్‌ సర్కార్‌ శ్రీకారం)

Advertisement
 
Advertisement
Advertisement