‘బాబు మత రాజకీయాలు.. పతనం తప్పదు..’ | MLA RK Roja Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘బాబు మత రాజకీయాలు.. పతనం తప్పదు..’

Jan 7 2021 4:01 PM | Updated on Jan 7 2021 5:43 PM

MLA RK Roja Comments On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: దేవుడితో రాజకీయం చేస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి మరింత పతనం తప్పదని ఏఐసీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే ఆర్‌కే రోజా హెచ్చరించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చారని, అలిపిరిలో దేవుడు ఎలా బుద్ధి చెప్పాడో తెలుసు. ఆయన పాలనలో విజయవాడలో గుళ్లను కూలగొట్టారు. అందుకే ఈ రోజు ఇంత పతనమయ్యారు. అయినా చంద్రబాబుకి బుద్ధి లేకుండా ఇప్పుడు మత రాజకీయాలు మొదలుపెట్టారు. సీఎం జగన్‌.. దేవాలయాల్లో భద్రత కోసం 20 వేల సీసీ కెమెరాలు పెట్టారు. చంద్రబాబు తన పాలనలో ఇలా ఎందుకు చెయ్యలేదు. అయ్యప్ప మాల వేస్తే మద్యం ఆదాయం తగ్గిపోతుందన్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. (చదవండి: సీఎం జగన్‌ కీలక నిర్ణయాలు..)

‘‘చంద్రబాబు హయాంలో ఆలయాలను కూల్చి టాయిలెట్లు కట్టారు. డీజీపీ మతం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు.. గతంలో సీపీగా పెట్టలేదా?.ఇప్పడు పనిచేస్తున్న అధికారులంతా చంద్రబాబు హయాంలో ఉన్నవారే కదా?. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను కొత్తగా తెచ్చారా?. చంద్రబాబు చేయని ఆలయాల అభివృద్ధి, నిర్మాణాలను సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్నారని రోజా అన్నారు.(చదవండి: రహదారుల అభివృద్ధికి 6400 కోట్లు)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement