పోలీసులకు డీజీపీ తీపికబురు.. వారంలో ఓరోజు వీక్లీ ఆఫ్‌.. బర్త్‌డేకూ..

TN DGP Orders Weekly Offs Holidays For Birthdays And Anniversaries For All Cops - Sakshi

సాక్షి, చెన్నై(తమిళనాడు): పోలీసులకు వారంలో ఓ రోజు తప్పనిసరిగా వీక్లీ ఆఫ్‌ ఇవ్వాల్సిందేనని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ శైలేంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. బర్త్‌డే, వివాహ వేడుక జరుపుకోదలచిన పోలీసులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలతో సెలవుకు ఆదేశించారు. విధి నిర్వహణలో పోలీసులకు పనిభారం పెరుగుతుండడాన్ని పరిగణించి వారంలో ఓరోజు సెలవు తప్పనిసరిగా అమలుకు డీజీపీ శైలేంద్రబాబు ఉత్తర్వులతో పోలీసు యంత్రాంగం శనివారం ప్రత్యేక ప్రకటన చేసింది.

ఆమేరకు అన్నిస్టేషన్లు, వివిధ విభాగాల్లో, ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసులకు వారంలో ఓ రోజు వీక్లీ ఆఫ్‌ తప్పనిసరి చేశారు.  ఎవరైనా పోలీసు బర్త్‌డే, వివాహ వేడుక జరుపుకోదలచిన పక్షంలో వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడమే కాకుండా, సెలవు మంజూ రుకు ఆదేశాల్ని ఆ ఉత్తర్వుల్లో వివరించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top