తార్ మార్ తక్కర్ మార్.. చివరికి భలే ట్విస్ట్‌ | Tiger Hide And Seek With Nilgai Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

వీడియో: తార్ మార్ తక్కర్ మార్.. చివరికి ఏమైందో చూడండి

Nov 7 2022 8:11 AM | Updated on Nov 7 2022 8:11 AM

Tiger Hide And Seek With Nilgai Video Viral On Social Media - Sakshi

దాక్కో.. దాక్కో.. పులి వీడియోలో చివరికి భలే ముగింపుతో ముగిసింది. విపరీతంగా వైరల్‌ అవుతోంది.. 

ప్రాణి ప్రపంచం వాటి మనుగడ పోరాటాన్ని మాత్రమే కాదు అప్పుడప్పుడు సరదాను కూడా మానవాళికి పంచుతుంటుంది. అలాంటి వీడియోనే ఒకటి విపరీతంగా వైరల్‌ అవుతోంది. 

ఆకలితో ఉన్న ఓ పులి..  నీల్గై (బ్లూబక్‌)ను చూసి వేటాడాలనుకుంది. దాడి చేసే క్రమంలో నెమ్మదిగా ముందుకు కదిలింది. సరిగ్గా.. ఆ నీలిజింక తలెత్తి చూసే సమయానికి కిందకు వంగుని దాగుడు మూతలు ఆడింది.  చివరికి.. ఆ రెండింటి మధ్య జరిగిన తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌ ఫలితం ఏంటో మీరూ చూసేయండి.

మధ్యప్రదేశ్‌ సాత్పురా నేషనల్‌ పార్క్‌లో ఈ ఘటన జరిగిందని రాజేష్‌ సనాప్‌ అనే వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ వీడియోను పోస్ట్‌ చేశారు. విపరీతమైన లైకులు, వ్యూస్‌తో దూసుకుపోతోంది ఆ వీడియో. సరదా కామెంట్లు మాత్రమే కాదు..  ఈ వీడియోపై సీరియస్‌ కోణంలోనూ కామెంట్లు కనిపిస్తున్నాయి.

ఇదీ చూసేయండి: రైళ్లలో కొందరు ఛాయ్‌ ఎలా వేడి చేస్తారో తెలుసా?

Advertisement
 
Advertisement
Advertisement