Viral Video: Tea Seller Uses Unclean Iron Rod To Heat Tea On Train - Sakshi
Sakshi News home page

Viral Video: ట్రైయిన్‌లో టీ ఇలానా వేడి చేసేది! బాబోయ్‌...

Nov 5 2022 8:42 PM | Updated on Nov 6 2022 4:25 PM

Viral Video: Tea Seller Uses Unclean Iron Rod To Heat Tea On Train - Sakshi

ట్రైయిన్‌లో మనకు రకరకాల పదార్థాలు అమ్ముతుంటారు. ఒక్కోసారి తప్పని పరిస్థితుల్లో లాంగ్‌ జర్నీ ఐతే అక్కడ ఏం అమ్ముతుంటే అవి కొనుక్కుని తినక తప్పదు. జనాలు ఎక్కువగా తాగేది టీ లేదా కాఫీ. ఎందుకంటే కాసేపు రిలాక్స్‌ అవ్వడానికి చిన్న కప్పు టీ పడితే చాలు అని చాలా మంది భావిస్తారు. కానీ ఇప్పుడూ ఈ సంగతి గనుక వింటే ట్రైయిన్‌లో టీ తాగడానికి కచ్చితంగా జంకుతారు.

వివరాల్లోకెళ్తే....ఒక ట్రైయిన్‌లో టీ అమ్మే వ్యక్తి ఎలా టీని వేడి చేస్తున్నాడో ఇద్దరు ప్రయాణకులు చూసి వీడియో తీశారు. ఆ వీడియోలో వ్యక్తి టీని వేడి చేయడం కోసం శుభ్రంగా లేని ఒక హీటర్‌ని ఉపయోగించి వేడి చేశాడు. అక్కడ అతను చేసే విధానం చూస్తే వాంతు వచ్చేలా ఉంది.

ఈ ఘటన సబరి ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. పలువురు ప్రయాణికులు సబరి ఎక్స్‌ప్రెస్‌లో విక్రయించే ఆహరపానీయాలు చాలా ఘోరంగా ఉంటాయని చెబుతున్నారు.ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది ఈ వీడియో. దీంతో నెటిజన్లు ఇలాంటి కాంట్రాక్టును రద్దు చేసి సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

(చదవండి: రోడ్డుపై చిరుత కలకలం... భయపెట్టించేలా పరుగు తీసింది)

Advertisement
 
Advertisement
Advertisement