సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురి ప్రమాణం | Three sworn in as Supreme Court judges | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురి ప్రమాణం

Oct 7 2026 5:05 AM | Updated on Oct 7 2026 5:05 AM

Three sworn in as Supreme Court judges

జస్టిస్‌ సునీతా అగర్వాల్, జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయ, జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌తో ప్రమాణ స్వీకారం చేయించిన సీజేఐ

సుప్రీంలో మూడుకు పెరిగిన మహిళా జడ్జిల ప్రాతినిధ్యం

సాక్షి, న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కొత్తగా ముగ్గురు న్యాయ­మూర్తులు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. జస్టిస్‌ సునీతా అగర్వాల్, జస్టిస్‌ దేవేంద్రకుమార్‌ ఉపాధ్యాయ, జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌సింగ్‌తో సుప్రీం­కోర్టు ఆవరణలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూ­­ర్యకాంత్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. తాజా నియామకాలతో సుప్రీంకోర్టులో సీజేఐతో కలుపు­కొని మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది. మరో న్యాయమూర్తి పదవి ఖాళీ ఉంది. సెప్టెంబర్‌ 28న కొలీజియం సిఫా­ర్సు­­ల మేరకు కేంద్రం ఈ ముగ్గురు న్యాయమూర్తుల నియామ­కాలను నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. 

కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈ ముగ్గురూ గతంలో వేర్వేరు రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయ­మూర్తు­లుగా పనిచేశారు. అలహాబాద్‌ను మాతృ హైకోర్టుగా కలిగిన జస్టిస్‌ సునీతా అగర్వాల్‌.. పదోన్నతికి ముందు గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. అలహాబా­ద్‌ మాతృ హైకోర్టుకే చెందిన జస్టిస్‌ దేవేంద్రకు­మార్‌ ఉపాధ్యాయ ఢిల్లీ హైకోర్టు సీజేగా విధులు నిర్వర్తించారు. జార్ఖండ్‌ మాతృ హైకోర్టుగా ఉన్న జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌సింగ్‌ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. ప్రమాణ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పలు హైకోర్టుల అధికారులు పాల్గొన్నారు.

ముగ్గురికి చేరిన మహిళా ప్రాతినిధ్యం
జస్టిస్‌ సునీతా అగర్వాల్‌ చేరికతో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య మూడుకు చేరు­కుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో మహిళా న్యాయ­మూర్తు­లు జస్టిస్‌ నాగరత్న, జస్టిస్‌ వి.మోహన ఉన్నారు. జస్టిస్‌ నాగరత్న 2027లో సీజేఐ అవుతారు. అయితే సీజేఐగా ఆమె పదవీకాలం దాదాపు నెల రోజులు ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement