దొంగలు ఎంతకు తెగించారు...ఏటీఎం మిషన్‌నే తవ్వేశారు

Thieves Used Excavator Dig Out ATM Machine From Booth - Sakshi

Thieves can go to any extent: ఇటీవలే బిహార్‌లో ఒక దొంగల ముఠా స్టీల్‌ బ్రిడ్జ్‌ని దొంగలించిన సంటన గురించి విన్నాం. అంతేందుక ఒక దొంగ ఒక మహిళ దృష్టి మరల్చడానిక హఠాత్తుగా డ్యాన్స్‌ చేసి రోలెక్స్‌ వాచ్‌ని ఎత్తుకుపోయిన సంగతి తెలిసిందే. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి డబ్బులు కోసం ఏటీఎం మిషన్‌ని ఎత్తుకుపోవాలనుకున్నాడు. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్లే...మహారాష్ట్రాలోని దొంగలు డబ్బులు కోసం ఏకంగా ఏటీఎం మిషన్‌ని తవ్వేందుకు యత్నించారు. అందుకోసం ఏకంగా ఎక్స్‌కవేటర్‌ని ఉపయోగించారు. ఈ ఘటన చూస్తే డబ్బలు కోసం ఎంతకైన తెగిస్తారు దొంగలు అ‍న్నట్లుగా ఉంది. అయితే ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీంతో నెటిజన్లు దొంగల ధైర్యాన్ని చూసి ఫిదా అవ్వడమే కాకుండా నిరుద్యోగం, ధరల పెరుగుదల కారణంగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయంటూ... ట్వీట్‌ చేశారు. 

(పిల్లలను తుపాకితో బెదిరిస్తున్న దుండగుడి వీడియోలు వైరల్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top