రోడ్డు ప్రమాదం.. పదిమంది మృతి | Ten Died In Road Accident At Rajasthan | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. పదిమంది మృతి

Dec 12 2020 11:19 PM | Updated on Dec 12 2020 11:23 PM

Ten Died In Road Accident At Rajasthan - Sakshi

జైపూర్‌ : రాజస్తాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాలు ఢీకొని 10 మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికుల సహాయంతో అస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వాహనాల అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. 

నెల్లూరు: నాయుడుపేట స్వర్ణముఖి వంతెనపై రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో చిన్నారి నదిలో పడి గల్లంతు అయ్యారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి కోసం గాలిస్తున్నారు. ఫైర్‌ సిబ్బంది సైతం సహాయ చర్యల్లో పాల్లొంది. మృతులు విశాఖకు చెందిన సాయి, త్రినాథ్‌లుగా గుర్తించారు.  మేనకూరు లోని గ్రీన్ టెక్ పరిశ్రమలో  ఉద్యోగులుగా తెలుసింది.

Advertisement
 
Advertisement
Advertisement