గుజరాత్‌ దిశగా కదులుతున్న 'తౌక్టే' తుపాను

Tauktae Cyclone Moving Towards Gujarat - Sakshi

ఈ నెల 18న గుజరాత్‌ వద్ద తీరం దాటనున్న తుపాను

కేరళ, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్‌లో భారీ వర్షాలు

కర్ణాటకలో భారీ వర్షాలు, నలుగురు మృతి

సాక్షి, ఢిల్లీ: 'తౌక్టే' తుపాను గుజరాత్‌ దిశగా కదులుతోంది. తుపాను ఈ నెల 18న గుజరాత్‌ వద్ద తీరం దాటనుంది. పోర్‌బందర్‌-మహువా తీరం మధ్య ఈ 18న వేకువజామున తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తుపాన్‌ ప్రభావంతో కేరళ, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంత రాష్ట్రాల్లో 53 ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు మోహరించాయి.

ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తున్న తౌక్టే తుపాను.. గోవాకు ఉత్తర వాయవ్యంలో కేంద్రీకృతమై ఉంది. రోజంతా ఈదురుగాలులు, వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. తుపాను ప్రభావంతో కర్ణాటకలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో 6 జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో నలుగురు మృతి చెందారు. కర్ణాటకలో 73 గ్రామాలపై తౌక్టే తుపాను ప్రభావం చూపుతోంది. ‘తౌక్టే' తుపానుపై ప్రధాని మోదీ సమీక్షించారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

ముంబై: ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో 500 మంది కోవిడ్‌ పేషెంట్లను ముంబైలోని వేర్వేరు ఆస్పత్రులకు బీఎంసీ తరలించింది. ముందు జాగ్రత్తగా బాంద్రా-సిర్లి సముద్ర మార్గాన్ని బీఎంసీ మూసి వేసింది.

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమీక్ష
తౌక్టే తుపాను తీవ్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమీక్ష జరిపారు. ఆదివారం ఆయన రాష్ట్రాలు, యూటీలు, ఏజెన్సీ సంస్థలతో సంసిద్ధతపై చర్చించారు. సమావేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌ ముఖ్యమంత్రులు, డామన్‌ డయ్యూ, దాద్రానగర్‌ హవేలి అధికారులు పాల్గొన్నారు.

చదవండి: Cyclone Tauktae: టౌటే ఎఫెక్ట్‌తో 21 జిల్లాల్లో అలర్ట్‌
ఊరట: దేశంలో మూడో రోజూ తగ్గిన కరోనా కేసులు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top