
తమిళనాడు: వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడితో కలిసి భార్య.. భర్తను హత్య చేయించిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. మూడేళ్ల కుమార్తె చెప్పిన సమాచారంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వేలూరు జిల్లా ఒడుకత్తూర్ వద్ద కుప్పంపాళ్యానికి చెందిన భారత్ చెన్నైలో ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ఐదేళ్ల కిందట బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల నందినితో వివాహమైంది. వారికి నాలుగు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారాంతపు సెలవు రోజుల్లో భార్యాపిల్లలను చూసేందుకు భారత్ ఇంటికొస్తుంటాడు.
ఈ నెల 21న ఇంటికొచ్చిన భారత్ సరకుల కోసం భార్య, చిన్న కుమార్తెను తీసుకుని ద్విచక్ర వాహనంపై దుకాణానికి వెళ్లాడు. తిరిగొస్తున్నప్పుడు రోడ్డులో కొబ్బరిమట్టలు అడ్డుగా ఉండటంతో వాటిని దాటే యత్నంలో అదుపుతప్పి కిందపడిపోయాడు. అక్కడే దాక్కున్న ఓ వ్యక్తి ఆయుధంతో భారత్‌పై తీవ్రంగా దాడి చేసి పారిపోయాడు. బాధితుడు ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు. విచారణలో నందిని పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు అనుమానం కలిగింది.
భారత్ చిన్న కుమార్తెను ఆరా తీయగా.. మూడేళ్ల చిన్నారిని పోలీసులు అడిగారు. తన ఇంటి ఎదురుగా ఉండే సంజయ్ మామ తండ్రిని కొట్టి చంపి పారిపోయాడని తెలిపాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. వెంటనే నందినితోపాటు సంజయ్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.