తమిళనాడులో అధికార మార్పు తప్పదా? సర్వేలో ఏముందంటే | tamilnadu elections 2026 c voter opinion poll | Sakshi
Sakshi News home page

తమిళనాడులో అధికార మార్పు తప్పదా? సర్వేలో ఏముందంటే

Apr 8 2026 9:25 PM | Updated on Apr 8 2026 9:25 PM

tamilnadu elections 2026 c voter opinion poll

మరికొద్ది రోజుల్లో తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎన్‌ఎన్‌, సీఓటర్‌ ఆ రాష్ట్రంలో నిర్వహించిన ఓపీనియన్ పోల్ సంచలన ఫలితాలను చూపుతోంది.  

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీ-ఓటర్, CNN-News18 వెల్లడించిన ఓపీనియన్ ఫోల్‌ ప్రకారం ప్రస్తుతం అధికారంలో ఉన్న DMK మరియు ప్రధాన ప్రతిపక్షం AIADMK మధ్య పోటీ తీవ్రంగా ఉండనున్నట్లు నివేదికలు తెలిపాయి. సీఓటర్‌ సర్వే ప్రకారం ఎన్నికల్లో డీఎంకే 41 శాతం ఓట్లు సాధించే అవకాశాలుండగా, ఏఐడీఎంకేకు 38 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అదే సీఎన్‌ఎన్‌- న్యూస్‌ 18 సర్వే ప్రకారం ఏఐడీఎంకేకు 41 శాతం, డీఎంకేకు 39 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

అదే సీట్ల విషయానికి వస్తే ఆశ్చర్యంగా ఏఐడీఎంకే కూటమికి 130-140 సీట్లు, డీఎంకే కూటమికి 90-100 సీట్ల మధ్యలో వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వే తెలిపింది. అదే విధంగా విజయ్‌ పార్టీకి 2-6 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. 

అదే ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే విషయంలో ఎం.కె. స్టాలిన్ మరియు ఎం. పళనిస్వామి ఇద్దరూ 39% మద్దతుతో సమానంగా ఉన్నారు. అయితే తమిళనాడులో మెుత్తం 234 స్థానాలుండగా మెజారిటీ మార్కు 118 కాగా ప్రస్తుత సర్వేల ప్రకారం 130 - 140 సీట్లు (ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉంది కూటమి: 90 - 100 సీట్లు, TVK  విజయ్ పార్టీ  2 - 6 సీట్లు సాధించే అవకాశం ఉంది.

అయితే ఈసారి  AIADMK, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తుండగా, DMK తన పాత మిత్రపక్షాలతో కలిసి బరిలోకి దిగుతోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో  AIADMK కూటమికి స్వల్ప ఆధిక్యం లభించే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అయితే గతంలో చాలా సార్లు సర్వేల అంచనాలు తలకిందులైన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement