షాకైన పోలీసులు.. ఆ ఇంట్లో ఏం జరిగిదంటే..?

Tamilnadu: Daughters Pray Over Mother Body Hoping Return To Life - Sakshi

చెన్నై: 4జీ దాటుకుని 5జీ యుగంలోకి అడుగుపెడుతున్నప్పటికీ కొందరు ఇప్పటికీ మూఢనమ్మకాలనే గుడ్డిగా నమ్ముతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి ఘటనే అందుకు ఉదాహరణ. తాజాగా తమ తల్లి చనిపోయినప్పటికీ తిరిగి బతుకుతుందనే నమ్మకంతో ఆమె మృతదేహం వద్దే మూడు రోజులుగా పూజలు చేశారు ఆమె కూతుళ్లు. ఈ వింత ఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలపిన వివరాల ప్రకారం..  మణపారై సమీపంలోని చొక్కంపట్టి వీజీపీ ఫ్లాట్‌కు చెందిన మేరీ (75) తన కుమార్తెలు జయంతి (43), జెసిందా (40)తో కలిసి ఉంటోంది. గత వారం మేరీకి ఆరోగ్యం సరిగా లేకోవడంతో తిరుచ్చి నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. తమ తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకుని వెళ్లిన కూతుళ్లు ఆమె బతకాలని రెండు రోజులుగా మృతదేహం వద్ద పూజలు చేయడం మొదలుపెట్టారు. ఈ తతంగాన్ని గమనించన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి లోపలి దృశ్యాన్ని చూసి షాక్కయ్యారు. రెండు రోజుల క్రితమే మేరీ చనిపోయినా, ఆమె బతుకుతుందనే నమ్మకంతో ఆమె మృతదేహం వద్ద ఇద్దరు కుమార్తెలు పూజలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. తమ తల్లి బతికే ఉందని, త్వరలో నిద్ర లేచివస్తుందని చెప్పిన కుమార్తెలు పోలీసులను తిరిగి వెనక్కి పంపేందుకు కూడా ప్రయత్నించారు. ఈ క్రమంలో మేరీ మృతదేహాన్ని తరలించేందుకు వచ్చిన 108 సిబ్బందిని కూడా వారు అడ్డుకున్నారు. చివరికి  ఎలానో మేరీ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు వారిద్దరికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

చదవండి: Nagaon Central Jail: 85 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ.. షాక్‌లో అధికారులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top