ఒకే రోజు 95 జంటలకు పెళ్లి.. ఎక్కడంటే!

Tamil Nadu: Mass Weddings In Thiruvanthipuram Temple Premises - Sakshi

అన్నానగర్‌(చెన్నై): తిరువందిపురంలో ఆదివారం ఒకే రోజు 95 పెళ్లిలు జరిగాయి. వివరాల్లోకి వెళితే.. కడలూరు సమీపంలోని తిరువందిపురంలో ప్రసిద్ధి చెందిన దేవనాథస్వామి ఆలయం ఉంది. గుడి ముందున్న కొండపై శుభ ఘడియలు ఉన్న రోజుల్లో రోజుకు 50 నుంచి 200 వరకు పెళ్లిళ్లు జరుగుతాయి. అలాగే తిరువందిపురం ప్రాంతంలోని ప్రైవేట్‌ మంటపాల్లో కూడా వివాహాలు జరుగుతాయి.

ఆదివారం ముహుర్తాలు ఉండడంతో తిరువందిపురంలోని దేవనాథస్వామి ఆలయ కొండపై ఉన్న హాలులో తెల్లవారుజామున నుంచి వివాహ వేడుకలు జరిగాయి. కొండపైన 70 పెళ్లిళ్లు జరగ్గా ఆ  గుడి చుట్టుపక్కల ప్రైవేట్‌ హాళ్లలో 25 పెళ్లిళ్లు మొత్తం 95 వివాహాలు జరిగాయి. అనంతరం భార్యాభర్తలు కుటుంబ సమేతంగా దేవనాథస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నారు. శుభకార్యాలకు జనం అధిక సంఖ్యలో వాహనాల్లో తరలివచ్చారు. దీంతో కడలూరు, బాలూరు రహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.

చదవండి: తాగుబోతు కోతి.. లిక్కర్‌ బాటిళ్లు చోరీ చేస్తూ లాగించేస్తోంది!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top