‘అమ్మ’ ఆలయంలో మోదీ, నడ్డా ఫొటోలు! | Tamil Nadu BJP Leaders Photos At Amma Jayalalitha Temple | Sakshi
Sakshi News home page

‘అమ్మ’ ఆలయంలో మోదీ, నడ్డా ఫొటోలు!

Mar 26 2021 12:45 PM | Updated on Mar 26 2021 1:25 PM

Tamil Nadu BJP Leaders Photos At Amma Jayalalitha Temple - Sakshi

 ఈ ఎన్నికల్లో తమ మధ్య పొత్తు ఉందని అందువల్ల తమ నాయకుల ఫోటోలు ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు

కొరుక్కుపేట: దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారకంగా నిర్మించిన అమ్మ ఆలయంలో బీజేపీ నేతల ఫొటోలు దర్శనమిచ్చాయి. మదురై, తిరుమంగలంలోని టి.కునత్తుర్‌లో అమ్మ పెరవై ఆధ్వర్యంలో నిర్మించిన అమ్మ జయలలిత ఆలయాన్ని జనవరి 30న ముఖ్యమంత్రి ఎడపాడి ప్రారంభించారు. ఈ ఆలయంలో గోడలపై అన్నాడీఎం కే ప్రముఖుల ఫొటోలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్‌ మినిస్టర్‌ అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు  నడ్డా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మురుగన్‌ ఫొటోలు దర్శనమివ్వడంతో అందరూ అవాక్కయ్యారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అన్నాడీఎంకే, బీజేపీ కూటమితో పోటీ చేస్తోందని అందువల్ల ఏర్పాటు చేసినట్టు పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు.  

చదవండి: ‘అమ్మ’కు వారసులు లేరా? 

Advertisement
 
Advertisement
Advertisement