తమిళనాడు నూతన డీజీపీగా శైలేంద్రబాబు 

Sylendra Babu Is New Tamil Nadu DGP - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)గా శైలేంద్రబాబు నియమితులయ్యారు. గత కొన్ని రోజులుగా పలు పేర్లు పరిశీలనలో ఉండగా ఎట్టకేలకూ శైలేంద్రబాబు పేరు మంగళవారం ఖరారైంది. 1987 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఇప్పటివరకు రైల్వే డీజీపీగా విధులు నిర్వరిస్తున్నారు. జైళ్లశాఖ డీజీ పీగా ఉన్నకాలంలో ఖైదీల్లో మానసిక పరివర్తన తీసుకురావడంతోపాటూ పునరావాసం పథకాలను ప్రవేశపెట్టి మానవత్వం ఉన్న అధికారిగా పేరుతెచ్చుకున్నారు. ఇక ప్రస్తుత డీజీపీ త్రిపాఠి పదవీకాలం బుధవారంతో ముగియనుంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top