కరోనా వ్యాప్తి: స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్‌ బంద్‌

Swiggy, Zomato: Food Delivery Apps Changed Their Timing - Sakshi

ముంబై: మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభణ చేస్తుండడంతో మహారాష్ట్రలో మినీ లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు లాక్‌డౌన్‌ అమల్లో చేస్తున్నారు. ఇక వారాంతాల్లో (శని, ఆదివారం) పూర్తి లాక్‌డౌన్‌ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అన్ని వ్యాపార కార్యకలాపాలు అందుకనుగుణంగా వాటి పనివేళలు మారుతున్నాయి. ఈ క్రమంలో ఫుడ్‌ డెలివరీ సంస్థలు కూడా దానికి అనుగుణంగా పనివేళలు మార్చి వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

మహారాష్ట్రలో రాత్రి 8 గంటల తర్వాత తాము డెలివరీ చేయలేమని జొమాటో, స్విగ్గీ సంస్థలు నిర్ణయించాయి. వినియోగదారులు కూడా ఇదే విషయాన్ని తమకు విజ్ఞప్తులు చేశారని ఆ సంస్థలు తెలిపాయి. రాత్రి 8 నుంచి ఉదయం 7గంటల వరకు మినీ లాక్‌డౌన్‌ విధించడంతో ఈ మేరకు ఆయా సంస్థలు తమ సేవల సమయాన్ని కూడా మార్చేశాయి. ఈ మేరకు ఈ విషయాన్ని తమ వినియోగదారులకు యాప్‌లలో నోటిఫికేషన్‌ ద్వారా ఆ సంస్థలు తెలియజేశాయి. ఈ మారిన వేళల్లో భాగంగా ఉదయం 7 నుంచి రాత్రి 8గంటలలోపు మాత్రమే స్విగ్గీ, జొమాటో సంస్థలు ఆహారం అందించనున్నాయి. ఈ సందర్భంగా తాము వినియోగదారులు, తమ సంస్థ ఉద్యోగుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని, అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తూ డెలివరీ చేస్తున్నామని ఆ సంస్థలు తెలిపాయి.

చదవండి: టిఫిన్ బాక్స్ బాంబు కలకలం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top