Abhishek Banerjee: సీఎం మమత మేనల్లుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. సీబీఐ, ఈడీ విచారణపై స్టే..

Supreme Court Stays Cbi Ed Questioning Tmc Abhishek Banerjee - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కాంకు సంబంధించి ఆయనను సీబీఐ, ఈడీ ప్రశ్నించవచ్చంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 24కు వాయిదా వేసింది. దీంతో అప్పటివరకు దర్యాప్తు సంస్థలు ఆయనను ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. 

అలాగే బెంగాల్ పోలీసులు.. సీబీఐ, ఈడీ అధికారులపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా సీజేఐ జస్డిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్టే విధించింది. ఫలితంగా టీఎంసీ సర్కార్‌కు  ఊరట లభించినట్లయింది.

బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కాంకు సంబంధించి మాజీ మంత్రి పార్థ చటర్జీ, మాణిక్ భట్టాచార్యలను ఇదివరకే అరెస్టు చేసింది సీబీఐ. తాజాగా ఇవాళ మరో ఎమ్మెల్యే జీవన్ కృష్ణ సాహాను కూడా అదుపులోకి తీసుకుంది. అయితే ఈ స్కాంతో అభిషేక్ బెనర్జీకి కూడా సంబంధంముందని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనను ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తోంది.
చదవండి: కాంగ్రెస్ గూటికి మాజీ సీఎం.. బీజేపీపై కీలక వ్యాఖ్యలు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top