సీబీఐ ఎదుట హాజరైన అనిల్‌ అంబానీ | Anil Ambani Appears Before CBI Rcomm Bank Fraud Case | Sakshi
Sakshi News home page

రూ.2,929 కోట్ల బ్యాంకు మోసం.. సీబీఐ ఎదుట అనిల్‌ అంబానీ

Mar 19 2026 1:58 PM | Updated on Mar 19 2026 1:58 PM

Anil Ambani Appears Before CBI Rcomm Bank Fraud Case

రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్‌) నిధుల మళ్లింపు కేసులో రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ గురువారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు నమోదైన రూ.2929.05 కోట్ల బ్యాంకు మోసం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించింది.

నిధుల మళ్లింపుపైనే ప్రధాన దృష్టి

తెల్లవారుజామునే ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న అనిల్ అంబానీని ఆర్‌కామ్‌కు కేటాయించిన రుణాల వినియోగంపై అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. కంపెనీ అవసరాల కోసం తీసుకున్న రుణాలను ఇతర అవసరాలకు మళ్లించడం, నిధుల దుర్వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక లావాదేవీలు జరిపారనే ఆరోపణలున్నాయి. ఎస్‌బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏడాది ఆగస్టులో అనిల్ అంబానీపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. అనిల్ అంబానీ ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 19, 20 తేదీల్లో ఆయన దర్యాప్తు సంస్థ ముందు విచారణకు హాజరు అవుతున్నారు.

ముగిసిన ‘జై అన్మోల్’ విచారణ

ఇదే క్రమంలో అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీని కూడా సీబీఐ వదిలిపెట్టలేదు. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌)లో జరిగిన రూ.228.06 కోట్ల ఆర్థిక అవకతవకలపై గత వారం (మార్చి 14, 2026) ఆయన్ను అధికారులు విచారించారు. ‘చట్టబద్ధమైన దర్యాప్తు సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు అనిల్ అంబానీ కట్టుబడి ఉన్నారు. అందులో భాగంగానే ఈ విచారణకు హాజరవుతున్నారు’ అని అనిల్ అంబానీ అధికార ప్రతినిధి చెప్పారు.

ఈ కేసులో మరికొంతమంది ప్రభుత్వ అధికారులు, రిలయన్స్ గ్రూప్ మాజీ ఉన్నతాధికారుల పాత్రపై కూడా సీబీఐ ఆరా తీస్తోంది. ఇప్పటికే జై అన్మోల్ నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు, తాము సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణను వేగవంతం చేశారు.

ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement