Gautam Gambhir: సుప్రీంకోర్టులో చుక్కెదురు.. అలా కుదరదు

Supreme Court Refuses To Stay Proceedings Against Gautam Gambhir Foundation - Sakshi

న్యూఢిల్లీ: మాజీ క్రికెట‌ర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌పై డ్ర‌గ్ కంట్రోల‌ర్ శాఖ‌ దాఖ‌లు చేసిన కేసులో స్టే ఇవ్వలేమంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గంభీర్‌ తరపున న్యాయవాది డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ చట్టం కింద ప్రాసిక్యూషన్‌కు స్టే ఇవ్వాలని కోరగా, కోర్టు ఈ విధంగా తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న స‌మ‌యంలో ఫాబీప్లూ మందులకు డిమాండ్‌ భారీగా ఉంది.

ఆ పరిస్థితుల్లో గంభీర్ ఫౌండేష‌న్ సుమారు రెండు వేల‌కు పైగా ఫాబీఫ్లూ ట్యాబ్లెట్ల‌ను ప్రజలకు పంచిన సంగతి తెలిసిందే. దీంతో  ఫాబీఫ్లూ టాబ్లెట్లను అక్ర‌మంగా నిల్వ చేసిన‌ట్లు గంభీర్‌పై ఆరోప‌ణ‌లు వచ్చాయి. కోర్టు ఆదేశానుసారం డీజీసీఐ.. గంభీర్ నిర్వహిస్తున్న ఫౌండేష‌న్ ఫాబీఫ్లూ ట్యాబ్లెట్ల‌ను అనధికారికంగా నిల్వ ఉంచడమే కాకుండా, పంపిణీ చేయడం డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్‌ యాక్ట్ ప్రకారం నేరంగా పరిగణిస్తూ ఆ ఫౌండేషన్‌ను దోషిగా తేల్చింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో గంభీర్‌ను దోషిగా పేర్కొంది.

ఈ కేసుకు సంబంధించి మరింత పురోగతి విచారణ కోసం కోర్టు అధికారులకు ఆరు వారాల గడువు ఇచ్చింది. అయితే తాజాగా ఆ కేసుకు సంబంధించి గంభీర్‌ తరపు న్యాయవాది స్టే కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై ధ‌ర్మాస‌నం తీర్పునిస్తూ.. ఆ కేసులో మేం స్టే ఇవ్వ‌లేమ‌ని, ఢిల్లీ హైకోర్టు ముందే మీ వాద‌న‌లు వినిపించాలంటూ తేల్చి చేప్పింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top