వైరల్‌: రైలు కోసం వేచి చూసి పట్టాలపై పడుకున్నాడు

Suicide Attempt, Man Saved by RPF Inspector at Mumbai Virar Station - Sakshi

ముంబై: ఒక్క క్షణం ఆలస్యమైనా అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఆయుశ్శు గట్టిగా ఉండటంతో వెంట్రుక వాసిలో గండం తప్పి ప్రాణాలతో బయటపడ్డాడు. తల్లి అకాల మరణాన్ని తట్టుకోలేని ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ముంబైలోని వీరార్‌ రైల్వేస్టేషన్లో ప్లాట్‌ఫామ్‌ మీద నిలబడి రైలు‌ కోసం ఎదురు చూశాడు. తీరా, రైలు దగ్గరకు రాగానే పట్టాల మీదకు వెళ్ళి పడుకున్నాడు. ఈ ఘటనతో అక్కడున్న ప్రయాణికులు భయపడిపోయారు. అయితే, ఆర్పీఫ్‌ సిబ్బంది మాత్రం సకాలంలో స్పందించి బాధితుడిని పట్టాల మీద నుంచి పక్కకు తప్పించారు.

ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతొంది. కాగా, ఆత్మహత్యకు కారణామేంటని పోలీసులు విచారించగా, తన తల్లి అకాల మరణాన్ని తట్టుకోలేక ఈ చర్యకు పాల్పడ్డానని తెలిపాడు. అయితే నెటిజన్లు మాత్రం ఆర్పీఎఫ్‌ పోలీసులు చూపిన తెగువను ప్రశంసిస్తున్నారు. 

చదవండి: ‘ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో’...

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top