స్ప్రింటర్‌ హిమదాస్‌కు డీఎస్పీ కొలువు | Sakshi
Sakshi News home page

స్ప్రింటర్‌ హిమదాస్‌కు డీఎస్పీ కొలువు

Published Thu, Feb 11 2021 12:18 PM

Star Sprinter Hima Das Appointed As DSP In Assam Police - Sakshi

గౌహతి: స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌ను డిప్యూటీ పోలీస్‌ సూపరింటెండెంట్‌గా నియమించాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం సర్బానంద సోనోవాల్‌ అధ్యక్షతన బుధవారం రాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. లీస్‌, ఎక్సైజ్, రవాణా తదితర వివిధ విభాగాల్లోని క్లాస్-1, క్లాస్-2 ఆఫీసర్లుగా క్రీడాకారులను నియమించడం ద్వారా రాష్ట్రంలో సమీకృత క్రీడా విధానాన్ని సవరించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి చంద్రమోహన్ పటోవరి విలేకరులకు తెలిపారు.


అసోం పోలీస్‌ విభాగంలో డీఎస్పీ ర్యాంకు అధికారిగా హిమదాస్‌ను.. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి క్లాస్ -1 ఆఫీసర్లుగా నియమించనున్నట్లు పేర్కొన్నారు. 20 ఏళ్ల ఈ అస్సామీ స్టార్‌ స్పింటర్‌ 2018లో అద్భుతంగా రాణించింది. ఫిన్లాండ్‌లో జరిగిన అండర్‌–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌ 400మీ.ఈవెంట్‌లో స్వర్ణం గెలిచి అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీల్లోనైనా అగ్రస్థానం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచింది. ఇదే చాంపియన్‌షిప్‌లో 4*400 రిలేలో మరో స్వర్ణం,  మిక్స్‌డ్‌ రిలేలో రజతం ఆమె ఖాతాలో చేరాయి. ఐఏఏఎఫ్‌ వరల్డ్‌ అండర్‌-20 చాంపియన్‌ షిప్స్‌లో గ్లోబల్‌ ట్రాక్‌ ఈవెంట్‌ ఏదైనా ఫార్మాట్‌లో బంగారు పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ అథ్లెట్‌గా రికార్డు సాధించింది.

Advertisement
Advertisement