నేడు కాంగ్రెస్‌ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశం | Sonia Gandhi to convene Congress Parliamentary strategy meeting | Sakshi
Sakshi News home page

నేడు కాంగ్రెస్‌ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశం

Published Tue, Sep 5 2023 6:08 AM | Last Updated on Tue, Sep 5 2023 6:08 AM

Sonia Gandhi to convene Congress Parliamentary strategy meeting - Sakshi

న్యూఢిల్లీ:  పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహంపై విపక్ష కాంగ్రెస్‌ దృష్టి పెట్టింది. కాంంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ వ్యూహ కమిటీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 18 నుంచి ఐదు రోజులపాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.

ఈ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై కాంగ్రెస్‌ పార్లమెంటరీ వ్యూహ కమిటీ భేటీలో చర్చిస్తారు. స్వల్ప జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం ఢిల్లీలోని సర్‌ గంగారాం ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ సోమవారం డిశ్చార్జి అయ్యారు. ఇంటికి చేరుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు సమాచారం. విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే త్వరలో సమావేశం కానున్నారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో కూటమి తరఫున అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement