సోనాలీ ఫోగాట్‌ హత్యకు రూ.10 కోట్ల డీల్‌! | Sonali Phogat death: Sonali Phogat Family receives mysterious letters | Sakshi
Sakshi News home page

సోనాలీ ఫోగాట్‌ హత్యకు రూ.10 కోట్ల డీల్‌!

Oct 10 2022 5:34 AM | Updated on Oct 10 2022 5:34 AM

Sonali Phogat death: Sonali Phogat Family receives mysterious letters - Sakshi

న్యూఢిల్లీ:  బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్‌ స్టార్, నటి సోనాలీ ఫోగాట్‌(42) హత్యకు రూ.10 కోట్ల డీల్‌ కుదిరిందని, ఈ మేరకు తమ కుటుంబానికి ఇటీవలే రెండు లేఖలు అందాయని ఆమె బావ అమన్‌ పూనియా తాజాగా చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈ రెండు లేఖలు వచ్చినట్లు తెలిపారు. ఒక లేఖలో రూ.10 కోట్ల డీల్‌ గురించి, మరో లేఖలో పలువురు రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయన్నారు.

లేఖల్లో కీలక సమాచార ముంది కాబట్టి వీటిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. సోనాలీ ఫోగాట్‌ ఆగస్టు 23న గోవాలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు తొలుత ప్రచారం జరిగింది. కానీ, ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నట్లు పోస్టుమార్టంలో తేలింది. విచారణ చేపట్టిన పోలీసులు సోనాలీ సహాయకులైన సుధీర్‌ సంగ్వాన్, సుఖ్వీందర్‌తోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం సీబీఐ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement