
12 ఏళ్ల వయస్సులో ఇంటి నుంచి వెళ్లిపోయిన వైనం
కొరుక్కుపేట(తమిళనాడు): చిన్న వయస్సులో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ హోటల్ యజమాని 40 ఏళ్ల తరువాత తల్లిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ త్రంలో ఆనందాన్ని నింపింది. తేని జిల్లా ఆండిపట్టి సమీపంలోని కదిర నరసింహం గ్రామానికి చెందిన నటరాజన్, అతని భార్య రుక్మిణి. ఈ దంపతులకు కుమార్, సెంథిల్, మురుగన్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వారు 1985లో తమ కుటుంబంతో కలిసి చెన్నైకి వెళ్లారు.
ఆ సమయంలో, అతని తల్లిదండ్రులు పెద్ద కొడుకు కుమార్‌ను పనికి వెళ్లమని కోరారు. దీంతో తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుమార్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా, 12 ఏళ్ల వయసులో కనిపించకుండా పోయిన కుమార్‌కు పుదుకోట్టై జిల్లాలోని మాచువాడి ప్రాంతంలోని ఆరుముగం అనే వ్యక్తికి చెందిన హోటల్‌లో ఉద్యోగంలో చేరాడు. కుమార్‌కు వివాహమై మాచువాడి గ్రామంలో భార్యతో పాటూ ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తర్వాత కుమార్ రెస్టారెంట్ నడుపుతున్నాడు.
ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం బస్సులో తేని వెళ్లేసరికి గతం అంతా కళ్లముందు మెదిలింది. దీంతో కుటుంబ సమేతంగా కదిర నరసింగపురంలో దిగారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి తల్లి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న వృద్ధ తల్లిని చూశాడు. మిగిలిన కుటుంబ సభ్యులు పెద్ద కొడుకు కుమార్ వచ్చాడని తల్లికి సమాచారం అందించారు. తన భార్య, కుమార్తెలను కూడా పరిచయం చేశాడు. రుక్మిణి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై తిరిగి కలుసుకున్నందుకు ఆనందంతో కన్నీళ్లతో కౌగిలించుకుంది. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజల్లో ఆనందాన్ని నింపింది.