రామ్‌ల్లా వెండి నాణెం విడుదల.. ధర ఎంతంటే.. | Centre Unveils Colored Souvenir Silver Coin of Ram Lalla | Sakshi
Sakshi News home page

Silver Coin of Ram Lalla: రామ్‌ల్లా వెండి నాణెం విడుదల.. ధర ఎంతంటే..

Published Sun, Apr 14 2024 12:02 PM | Last Updated on Sun, Apr 14 2024 12:25 PM

Silver Coin of Ram Lalla Launched - Sakshi

అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమయ్యాక రామ్‌లల్లాను దర్శించుకునేందుకు వేలాదిగా భకులు తరలివస్తున్నారు. వీరు ఇక్కడి వస్తువులను కొనుగోలు చేసి, తమతో పాటు తీసుకువెళుతున్నారు. అయోధ్యకు వచ్చి  రామ్‌లల్లా దర్శనం చేసుకోలేని వారు ఆన్‌లైన్‌లో ప్రసాదాన్ని తెప్పించుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం 50 గ్రాముల అయోధ్య రామాలయ వెండి నాణేలను ప్రజలకు విక్రయించేందుకు విడుదల చేసింది.

ఈ నాణెం ధర రూ. 5,860. 50 గ్రాముల బరువున్న ఈ నాణెం 999 స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు. దీన్ని ఎస్‌పీఎంసీఐసీఎల్‌ఐ వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ నాణెంలో ఒక వైపు రామ్ లల్లా విగ్రహం, మరొక వైపు రామాలయ దృశ్యం కనిపిస్తాయి. ఆలయంలోని రామ్‌లల్లా విగ్రహాన్ని శిల్పి అరుణ్ యోగి రాజ్ రూపొందించారు. దీనిని ఇంటిలోని పూజా మందిరంలో ఉంచవచ్చని, లేదా ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చని ట్రస్ట్‌ తెలిపింది. 

ప్రధాని మోదీ గత జనవరి 22న అయోధ్య  రామాలయంలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.  ఈ కార్యకమం జరగుతుండగా  ఆర్మీ హెలికాప్టర్లు ఆలయంపై పూలవర్షం కురిపించాయి. ఆరోజు మొదలుకొని అయోధ్యలో సందడి కొనసాగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement