షెహ్లా రషీద్‌ దేశ ద్రోహి: బీజేపీ నేత రవీందర్‌ రైనా

Shehla Rashid Desa Drohi bjp leader Ravinder Raina - Sakshi

సాక్షి, ఢిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి షెహ్లా రషీద్‌పై తన తండ్రి అబ్దుల్ షోరా చేసిన తీవ్రమైన ఆరోపణలు నేపథ్యంలో ఆమె వాక్చాతుర్యాన్ని కొనసాగిస్తున్నారు. తన కుమార్తె దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని రషీద్‌ షోరా పోలీసులకు లేఖ రాశారు. ఇప్పుడు దీనిపై జమ్మూకశ్మీర్‌ బీజేపీ ఛీఫ్‌ రవీందర్‌ రైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో అశాంతిని వ్యాప్తి చేయడానికి షెహ్లా రషీద్‌కు హవాలా ద్వారా డబ్బులు వస్తున్నాయని రవీం‍దర్‌ రైనా ఆరోపించారు. రవీందర్‌ గతంలో కూడా వేర్పాటువాద నాయకులపై, జమ్మూకశ్మీర్‌ నాయకులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.  చదవండి: (ఎన్డీయేకు మరో మిత్రపక్షం గుడ్‌బై..)

తన కుమార్తెకు ప్రాణాలకు ముప్పు ఉందని, ఆమె దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. అమెరికా వెళ్లిన తర్వాత షెహ్లా పార్టీని ఏర్పాటు చేశారని షెహ్లా రషీద్ తండ్రి అబ్దుల్ షోరా చెప్పారు.  ఆ పార్టీకి నిధులన్నీ యాంటీ నేషనల్ ఫోర్స్ నుండి వస్తున్నాయి, ఏ జాతీయ పార్టీ వారికి నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు.  ఈ డబ్బు మూలాన్ని కనుగొనాలని, అలాగే తనకు భద్రత కల్పించాలని  డిజికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ లేఖపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా చర్యలు తీసుకున్నారు. అబ్దుల్ రషీద్ షోరా ఆరోపణలను ధృవీకరించడానికి వీలుగా ఈ విషయాన్ని పరిశీలించాలని ఎస్‌ఎస్‌పి శ్రీనగర్‌కు ఆదేశించినట్లు కాశ్మీర్ ఐజి విజయ్ కుమార్ తెలిపారు.

మరోవైపు తన తండ్రి ఆరోపణలపై షెహ్లా వివరణ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ 'నిరాధారమైన, అసహ్యకరమైనవి' అని అభివర్ణించారు. తన తండ్రి చేసినట్లు కుటుంబంలో ఇది జరగదని షెహ్లా ట్విట్టర్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. తనతోపాటు తన తల్లి,  సోదరిపై నిరాధారమైన ఆరోపణలు చేశారని చెప్పారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top