
కోల్‌కత: మాయదారి కరోనా జర్నలిస్టులపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. పెద్ద ఎత్తున జర్నలిస్టులు కూడా కరోనాకు బలవుతున్నారు. తాజాగా టీవీ 9 బెంగాల్ న్యూస్ ఛానల్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ అంజన్ బందోపాధ్యాయ్ కరోనాతో కన్నుమూశారు. దీంతో బెంగాల్ జర్నలిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌లో ప్రముఖ టీవీ యాంకర్‌లలో అంజన్ బందోపాధ్యాయ్ ఒకరు.
ఆయన జీ 24 గంట బెంగాల్ టీవీ ఛానల్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాంకర్‌గా కూడా చేస్తున్నారు. ఏప్రిల్ 14వ తేదీన అంజన్ కరోనా బారినపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జయ్యారు. కొన్ని రోజులకు మళ్లీ కరోనా తిరగబెట్టింది. తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రిలో చేరారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆయన మృతిచెందారు. అంజన్ బందోపాధ్యాయ్ జర్నలిజంలో 33 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. అంతకుముందు ఆనంద్‌బజార్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఎడిటర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయన టీవీ 9 బెంగాల్ న్యూస్ ఛానల్ ఎడిటర్‌గా కొనసాగుతున్నారు.